WhatsApp Username : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. మీ యూజర్‌నేమ్‌ను ముందే రిజర్వ్ చేసుకోండి!
WhatsApp Username : వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ కోసం ఫోన్ నెంబర్ బదులుగా యూజర్ నేమ్ వాడుకోవచ్చు. మీకు నచ్చిన యూజర్ నేమ్ కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోండి..
- Sreehari A
- Published on- June 30, 2026 / 01:45 PM IST
WhatsApp Username
- వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఆధారిత చాట్ ఫీచర్
- మొబైల్ నంబర్ ప్రైవసీ, రిజర్వేషన్ వచ్చే వారం ప్రారంభం
- యూజర్‌నేమ్ జనరేటర్ టూల్, అదనపు ప్రైవసీ కీ కూడా
WhatsApp Username : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీ మొబైల్ నెంబర్ ఎవరికి చెప్పనక్కర్లేదు. కేవలం యూజర్ నేమ్ చెబితే చాలు.. వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్ మొబైల్ నెంబర్ షేర్ అవసరం లేకుండానే చాట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అదిరిపోయే ప్రైవసీ ఫీచర్‌ను తీసుకువస్తోంది. వాట్సాప్‌లో యూజర్‌నేమ్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
అంటే.. ఇకపై యూజర్లు తమ ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్‌నేమ్‌లతో ఒకరినొకరు చాట్ (WhatsApp Username) చేసుకోవచ్చు అనమాట. వచ్చే వారం నుంచి యూజర్‌నేమ్ రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఫీచర్‌ను ఈ ఏడాది నుంచి వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు మెటా సొంత యాప్ పేర్కొంది.
వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కోసం యూజర్‌నేమ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. కంపెనీ ప్రకారం.. వాట్సాప్‌లో పబ్లిక్ యూజర్‌నేమ్ డైరెక్టరీ ఉండదు. అంటే.. మీ ఒరిజినల్ యూజర్‌నేమ్ తెలిస్తేనే ఎవరైనా మిమ్మల్ని ఫస్ట్ టైమ్ కాంటాక్టు అవ్వగలరు.
ఫోన్ నంబర్‌కు ఫుల్ ప్రైవసీ :
వాట్సాప్ యూజర్లు తమ యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకుంటే.. ఫస్ట్ టైమ్ చాట్ ఓపెన్ చేయగానే మొబైల్ నంబర్ అవతలి వ్యక్తికి కనిపించదు. మొబైల్ నెంబర్ ఇతరులకు కనపడకుండా, ఎవరికి షేర్ చేయడం ఇష్టపడని వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
కంపెనీ ఆప్షనల్ యూజర్‌నేమ్ కీ ఫీచర్‌పై కూడా వర్క్ చేస్తోంది. ఒకవేళ వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ఆన్ చేస్తే వారి యూజర్‌నేమ్ తెలిస్తే చాలు.. ఎవరూ వారికి మెసేజ్ పంపకుండా ఆపేయొచ్చు. అదనపు ప్రైవసీ కోసం యూజర్‌నేమ్ కీ కూడా అవసరం పడుతుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కోసం యూజర్‌నేమ్ :
క్రియేటర్లు, చిరు వ్యాపారాలు, సంస్థలు తమ ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ యూజర్‌నేమ్‌లను వాట్సాప్‌లో కూడా రిజర్వ్ చేసుకోవచ్చునని వాట్సాప్ తెలిపింది. అయితే, ఈ ఫీచర్ వినియోగదారులందరికీ ఎలా అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
యూజర్‌నేమ్ జనరేటర్ టూల్ :
మీకు ఇష్టమైన యూజర్‌నేమ్ ఇప్పటికే వాడుతుంటే.. అదే మాదిరి యూజర్‌నేమ్‌లను ఎంచుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ ‘యూజర్‌నేమ్ జనరేటర్’ అనే టూల్ కూడా అందిస్తుంది.
వాట్సాప్ యూజర్‌నేమ్‌ను ఎలా రిజర్వ్ చేసుకోవాలి? :
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మీ ఖాతాకు అందుబాటులోకి రాగానే ఈ కింది విధంగా మీరు యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు.
- వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
- యాప్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌కు వెళ్లండి.
- వాట్సాప్ అకౌంట్ పై ట్యాప్ చేయండి.
- యూజర్‌నేమ్ ఆప్షన్ ఎంచుకోండి.
- మీకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ఎంచుకుని ఆపై సేవ్ చేసుకోండి.
