Lava Agni 4 5G : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. లావా అగ్ని 4 5G అతి చౌకైన ధరకే.. ఈ డీల్ అస్సలు మిస్ అవ్వొద్దు!
Lava Agni 4 5G : అమెజాన్‌లో లావా అగ్ని 4 ఫోన్ అతి చౌకైన ధరకే లభ్యమవుతోంది. బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా ఈ ఫోన్ ధర రూ. 23,999కు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు

Lava Agni 4 5G : లావా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. 2025లో లాంచ్ అయిన లావా అగ్ని 4 ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. కొంటే లావా ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.

లావా అగ్ని 4లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. 5,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ OIS సపోర్ట్‌తో వస్తుంది. మెయిన్ కెమెరా 50MPతో వస్తుంది.

సెల్ఫీల విషయానికి వస్తే.. 50MP కెమెరా సెన్సార్ కూడా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు అన్ని స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండగా లావా అగ్ని 4 తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

లావా అగ్ని 4 ధర, ఆఫర్లు :
లావా అగ్ని 4 ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 27,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేమెంట్లపై రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా లావా ఫోన్ ధర రూ. 23,999కి తగ్గుతుంది.

మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 26,500 వరకు తగ్గించుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ అనేది ప్రస్తుత పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

లావా అగ్ని 4 స్పెసిఫికేషన్లు :
ఈ లావా ఫోన్లో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. లావా అగ్ని 4 మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 5,000mAh బ్యాటరీ ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. లావా అగ్ని 4లో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, OTG సపోర్ట్, GPS, NFC, సింగిల్ యూఎస్బీ టైప్-C పోర్ట్ ఉన్నాయి.
