WhatsApp Schedule Calls : భలే ఉందిగా ఫీచర్.. వాట్సాప్‌లో మీ కాల్స్‌ ఇలా ఈజీగా షెడ్యూల్ చేయొచ్చు.. సింపుల్ గైడ్ మీకోసం

WhatsApp Schedule Calls : వాట్సాప్ వాయిస్, వీడియో కాల్‌లను షెడ్యూల్ కోసం అద్భుతమైన ఫీచర్.. యాప్‌లోనే ఈజీగా డేట్, టైమ్ సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ కాల్స్ టైప్ కూడా ఎంచుకోవచ్చు. రిమైండర్‌లను పంపవచ్చు.

WhatsApp Schedule Calls

  • వాట్సాప్‌లో కాల్స్ కోసం అదిరిపోయే ఫీచర్
  • వాట్సాప్ లో వాయిస్, వీడియో కాల్స్ షెడ్యూల్ చేయొచ్చు
  • వాట్సాప్ కాల్స్ షెడ్యూల్ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp Schedule Calls : వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్.. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ పర్సనల్, ప్రొఫెషనల్ వర్క్ కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఆఫీసుల్లో అయితే మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి కోసం వాట్సాప్ అద్భుతంగా ఉంటుంది.

ఇతర యాప్‌లలో కాల్స్ షెడ్యూల్ చేయడం కొంచెం కష్టంగా ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అదే మీరు వాట్సాప్ వాడితే చాలా ఈజీగా ఉంటుంది. అయితే, ఇందులో వాట్సాప్ కాల్ అవసరమైన సమయంలో షెడ్యూల్ చేయొచ్చు. ఆ సమయానికి ఆయా యూజర్లకు నోటిఫికేషన్ వెళ్తుంది.

సాధారణంగా ముందుగా ఏదైనా కాల్‌ను షెడ్యూల్ చేసి ఆపై ఇతర యూజర్లకు పర్సనల్‌గా నోటీఫై చేయాల్సి ఉంటుంది. కానీ, వాట్సాప్ కొత్త ఫీచర్ ఒకరి నుంచి పలువురు యూజర్లతో వాయిస్/వీడియో కాల్స్ ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు.

మీరు వారికి ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లందరికి నోటిఫికేషన్‌లు, అలర్ట్‌లను పంపుతుంది. ఇంతకీ ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ కాల్స్ ఎలా షెడ్యూల్ చేయాలో ఫుల్ గైడ్ ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Dhurandhar Font : మీ ఇన్‌స్టా రీల్స్ కోసం ‘ధురందర్’ ఫాంట్.. ఇక రీల్స్ వైరల్ అంతే.. ఎలా వాడాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!

  • మీ వాట్సాప్‌లో, కాల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీకు షెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • మీ కాల్ కోసం డేట్, టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
  • వీడియో లేదా వాయిస్ అనే కాల్ టైప్ కూడా ఎంచుకోవచ్చు.
  • మీరు కాల్ ఎండ్ టైమ్ కూడా డిలీట్ చేయొచ్చు.
  • వాట్సాప్‌లో రిమైండర్‌ను కూడా సెట్ చేయొచ్చు.
  • ‘Next’పై క్లిక్ చేసి షెడ్యూల్ చేసే కాంటాక్ట్‌ను ఎంచుకోండి.
  • కాల్‌ను షెడ్యూల్ చేసి ఇతర యూజర్లకు కూడా నోటిఫై అవుతుంది.
  • మీ క్యాలెండర్‌లో కూడా యాడ్ చేయొచ్చు.
  • మీరు చాట్స్ లేదా కాల్స్ సెక్షన్ కింద కూడా ఈవెంట్‌ను ఎడిట్ చేయొచ్చు.

షెడ్యూల్ చేసిన కాల్స్‌ను ఎలా డిలీట్ చేయాలి? :

  • కాల్స్ సెక్షన్ కింద మీ (Upcoming Call )కాల్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత కాల్స్‌ను ఎడిట్ చేయండి > ఈవెంట్‌ను క్యాన్సిల్ (Cancel Event) చేయండి.
  • ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లుగా ఇతర యూజర్లకు కూడా నోటిఫికేషన్ వెళ్తుంది
  • వాట్సాప్ కాల్‌ను డిలీట్ చేసేందుకు ‘delete for everyone’ఆప్షన్ క్లిక్ చేయడం.

ఈ ఫీచర్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. రిమైండర్ ఫీచర్ కాల్‌కు 10-15 నిమిషాల ముందు గుర్తు చేస్తుంది. వాట్సాప్ కాల్ కోసం జాయినింగ్ లింక్‌ కూడా జనరేట్ అవుతుంది. ఈ లింక్ ఇతర యూజర్లకు షేర్ చేసి వారిని కూడా కాల్స్‌లో జాయిన్ చేయవచ్చు.