Dhurandhar Font : మీ ఇన్‌స్టా రీల్స్ కోసం ‘ధురందర్’ ఫాంట్.. ఇక రీల్స్ వైరల్ అంతే.. ఎలా వాడాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!
Dhurandhar Font : ధురందర్: ది రివెంజ్ మూవీ స్ఫూర్తితో ఇన్స్టాగ్రామ్ లిమిటెడ్ ఎడిషన్ ఫాంట్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో 'ఎడిట్స్ బై ఇన్స్టాగ్రామ్' యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త టైపోగ్రఫీ ఫీచర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
Dhurandhar Font
- ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అద్భుతమైన ఫీచర్
- ఇన్స్టాగ్రామ్ లిమిటెడ్ ధురందర్ ఎడిషన్ ఫాంట్ ఇదిగో
- టైపోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫీచర్ రిలీజ్
- ధురందర్ ఫాంట్ ఎలా వాడాలో తెలుసా?
Dhurandhar Font : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఇన్‌స్టా రీల్స్ బాగా వైరల్ కావాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఒకసారి వాడి చూడండి.. మీ రీల్ ధురందర్ మూవీలా ఫుల్ వైరల్ అవుతుంది.
ఇన్స్టాగ్రామ్ ‘ఎడిట్స్ బై ఇన్స్టాగ్రామ్’ అప్లికేషన్లో ‘ధురందర్: ది రివెంజ్’ సినిమా స్ఫూర్తితో కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఫాంట్ రిలీజ్ చేసింది. వినియోగదారుల టైపోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్ వినియోగదారులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఇంతకీ ఈ ధురందర్ ఫాంట్ ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎడిట్లను డౌన్లోడ్ చేయండి.
- మీ ID పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- ‘+’ ఐకాన్ పై క్లిక్ చేసి ఫొటో లేదా వీడియో తీయండి.
- మీరు వీడియో రికార్డింగ్ పూర్తి చేశాక > Next ఆప్షన్ ఎంచుకోండి.
- ‘Select Text’పై క్లిక్ చేయండి. టెక్స్ట్ రాసి ‘All’ సెక్షన్ కింద ‘Dhurandhar’ ఫాంట్‌ను ఎంచుకోండి.
- మీరు ‘Outline’, ‘Reverse Outline’, ‘Reverse Background’ ‘Background’తో కూడా ఫాంట్ స్టయిల్ మార్చవచ్చు.
- కంప్లీట్ అయ్యాక మీ మిగిలిన ఫొటో లేదా వీడియోను సౌండ్ ఎఫెక్ట్‌లతో ఎడిట్ చేసి, ‘Next’పై క్లిక్ చేయాలి.
- ఆపై ఎక్స్ట్రాక్ట్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయవచ్చు.
ఎలా పొందాలంటే? :
ఇన్స్టాగ్రామ్ ఈ సరికొత్త ఫీచర్ ‘ధురందర్: ది రివెంజ్’ పై హైప్‌ను క్రియేట్ చేయడంతో పాటు, ధురందర్ కొత్త ఫాంట్ ద్వారా యూజర్లకు రీచ్‌ను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించేందుకు మీరు సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను బ్యాగ్ గ్రౌండ్ ధురందర్ మ్యూజిక్ కూడా వాడొచ్చు.
ఇది లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్. కొత్త ఫాంట్ స్టైల్ వెంటనే రీల్‌పై కనిపిస్తుంది. ఈ ఫీచర్ కోసం మీరు పెద్ద కంటెంట్ క్రియేటర్ కానవసరం లేదు. ఏ ఇన్స్టాగ్రామ్ యూజర్ అయినా తమ కంటెంట్‌ను అట్రాక్టివ్ ఉండేలా చేయొచ్చు.
