WhatsApp Accounts : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ అకౌంట్లు ఈజీగా స్విచ్ అవ్వొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

WhatsApp Accounts : మీరు వాట్సాప్‌లో ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లను వాడాలని అనుకుంటే ఇకపై చాలా ఈజీ.. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్లలో వాట్సాప్ అకౌంట్ల మధ్య ఈజీగా మారిపోవచ్చు. అది ఎలాగంటే?

WhatsApp Accounts

  • ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్లకు వాట్సాప్ అకౌంట్లు ఈజీగా మార్చుకోవచ్చు
  • మీరు ఒకే డివైజ్ నుంచి వాట్సాప్‌లో రెండు అకౌంట్లను ఒకే సమయంలో వాడొచ్చు
  • వాట్సాప్ ఆడియో, వీడియో కాలింగ్‌తో పాటు మీడియా షేరింగ్‌ ఆప్షన్ కూడా

WhatsApp Accounts : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు వాట్సాప్‌లో ఇకపై ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లను వాడుకోవచ్చు. వాస్తవానికి, వాట్సాప్ ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అకౌంట్ల మధ్య మారే ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐఫోన్‌లలో కూడా మల్టీ అకౌంట్లు వాడే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలోనూ మల్టీ-అకౌంట్ సపోర్ట్ అందుబాటులో ఉంది.

ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను యాడ్ చేసుకుని వాటి మధ్య ఈజీగా మారవచ్చు. యూజర్లు వేర్వేరు ఫోన్ నంబర్‌లు, సిమ్ కార్డులు లేదా ఇతర డివైజ్‌లకు లింక్ చేసిన అకౌంట్లను కూడా యాడ్ చేయొచ్చు. అయితే, లాగ్ అవుట్ చేయకుండానే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంటులోకి మారవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్‌లో వాట్సాప్ అకౌంట్లను ఎలా మార్చాలి? :

  • మీ ఐఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ట్యాబ్‌ను ట్యాప్ చేయండి.
  • మీ అకౌంట్ల కోసం మీ ప్రొఫైల్ పేరు పక్కన కింద ఉన్న చెవ్రాన్ ఐకాన్‌ ట్యాప్ చేయండి.
  • ఆ తర్వాత సెకండ్ అకౌంట్ ఎంచుకుని వెంటనే స్విచ్ అవ్వండి.
  • మీరు రెండో అకౌంట్ యాడ్ చేయకుంటే మీ ఐఫోన్‌ను రీస్టార్ట్ చేసి చూడండి.
  • కనెక్షన్‌ను రిఫ్రెష్ కోసం Wi-Fi నుంచి మొబైల్ డేటాకు మారండి.
  • మీ ఫోన్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
  • సెకండ్ అకౌంట్ యాడ్ కోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
  • మీ పేరు పక్కన ఉన్న ప్లస్ ఐకాన్‌ ట్యాప్ చేసి (Add Account)ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత నిబంధనలు, షరతులను అంగీకరించాలి.
  • మీ నంబర్‌ను రిజిస్టర్ చేసి వెరిఫై చేయండి.
  • ఆపై మీ ప్రొఫైల్‌ను సెటప్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ అకౌంట్లను ఎలా మార్చుకోవాలి? :

Read Also : Maruti Suzuki : మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు శుభవార్త.. మారుతి కార్లు ఇప్పుడు మరింత చవక.. ఏకంగా రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్..!

  • ముందుగా, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
  • మూడు వర్టికల్ డాట్స్ వద్ద క్లిక్ చేసి ‘More’ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
  • మీ రెండు వాట్సాప్ అకౌంట్‌ల మధ్య మారేందుకు ‘Switch Account’పై ట్యాప్ చేయండి.
  • వాట్సాప్ సింగిల్ డివైజ్‌లో గరిష్టంగా 2 అకౌంట్‌లను మాత్రమే యాడ్ చేయొచ్చు
  • మీరు వాడని అకౌంట్ నుంచి కూడా మీకు మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి.
  • మెసేజ్‌లను రీడ్ చేయడం లేదా కాల్ వివరాల కోసం అకౌంట్‌కు మారాల్సి ఉంటుంది.
  • మీరు రెండో అకౌంట్‌ను యాడ్ చేయకుంటే ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.
  • ఆ తర్వాత కూడా సమస్య కొనసాగితే.. వై-ఫై మొబైల్ డేటా మధ్య మారవచ్చు.
  • మీ ఫోన్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ అయిందో లేదో కూడా చెక్ చేయాలి.