WWDC 2026 : ఆపిల్ మెగా షో టైమ్.. WWDC 2026 లైవ్ ఎలా చూడాలి? iOS 27, ఏఐ సిరిపై అందరి చూపు!
WWDC 2026 : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ ఇతర డివైజ్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఆపిల్ WWDC 2026లో ఆవిష్కరించనుంది. ఈ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ జూన్ 8న రాత్రి 10:30 గంటలకు జరగనుంది.
- Sreehari A
- Published on- June 8, 2026 / 02:59 PM IST
- ఆపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ లాంచ్ 2026 ఈవెంట్
- ఐఓఎస్ 27 కొత్త సిరి అప్‌డేట్, యూజర్ ఇంటర్‌ఫేస్ సపోర్ట్
- జూన్ 8 నుంచి జూన్ 12 వరకు ఈవెంట్ జరగనుంది
- ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, వాచ్ XR డివైజ్‌లకు OSల ప్రదర్శన
WWDC 2026 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) ఈవెంట్ జూన్ 8, 2026న జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో కంపెనీ రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనుంది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, వాచ్ ఎక్స్ఆర్ డివైజ్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను ప్రదర్శించనుంది. ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొని ఆపిల్ రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టింగ్ యాప్‌లను డిజైన్ చేస్తారు అనమాట.
ఈ ఆపిల్ ఈవెంట్ చిన్నదే.. సెప్టెంబర్‌లో జరిగే ఆపిల్ ఈవెంట్ లాంటిది కాదు. ఎందుకంటే.. కంపెనీ ఇందులో ఎలాంటి ప్రొడక్టులను లాంచ్ చేయదు. ప్రధానంగా కంపెనీ ప్రొడక్టులు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు సాఫ్ట్‌వేర్‌లను ప్రదర్శిస్తుంది.
అలాగే, రాబోయే ఆపిల్ డివైజ్‌ల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్ సపోర్ట్ గురించి వివరాలను అందిస్తుంది. పాత ఆపిల్ డివైజ్‌లలో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ముగియనుందని కూడా కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
ఆపిల్ ఈవెంట్ టైమ్ ఎప్పుడంటే? :
ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) కీనోట్ జూన్ 8న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కాన్ఫరెన్స్ జూన్ 12వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు జరుగుతుంది.
దాంతో వరల్డ్ వైడ్ డెవలపర్లు ఆపిల్ ఎకోసిస్టమ్‌ను ఈజీగా యాక్సస్ చేయొచ్చు. ఈ ఈవెంట్‌లో ప్రధానంగా ఐఫోన్ల కోసం iOS 27 అప్ డేట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఐప్యాడ్‌ల కోసం iPadOS 27 కూడా ఉండనుంది.
iOS 27 ఫీచర్లు ఇవే :
లీక్ డేటా ప్రకారం.. రాబోయే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27 అప్‌డేట్.. iOS 26తో పోలిస్తే అదిరిపోయే అప్‌గ్రేడ్‌లతో వస్తుందని అంచనా. ఐఫోన్ యూజర్లు కొన్ని ఆండ్రాయిడ్ ఫీచర్లు కూడా పొందవచ్చు.
కెమెరా యాప్‌లో స్పెషల్ సిరి-ఆధారిత మోడ్ కూడా ఉండనుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీలో యూజర్లకు అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు గతంలో కన్నా ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయని అంచనా.
ఏఐ ఫీచర్ల విషయానికి వస్తే.. ఫొటోస్ యాప్ కూడా భారీ అప్‌గ్రేడ్ అందుకోనుంది. వినియోగదారులు తమ ఐఫోన్‌తో తీసిన ఫొటోలను ఆన్-డివైస్ ఏఐతో ఎడిట్ చేయొచ్చు. iOS 27, MacOSX స్నో లెపర్డ్ మాదిరి యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. గత ఆపరేటింగ్ సిస్టమ్‌లోని అనేక బగ్స్‌ను కూడా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ ఐఫోన్‌లకు iOS 27 అప్‌డేట్ :
ప్రస్తుతం ఆపిల్ కంపెనీ iOS 27 రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. వచ్చే సెప్టెంబర్‌లో జరగబోయే ఆపిల్ ఈవెంట్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు, ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్ వాడే యూజర్లకు కూడా iOS 27 అప్‌డేట్ రానుంది.
ఆపిల్ కీనోట్ టైమ్, లైవ్‌స్ట్రీమ్ ఎలా చూడాలి? :
కాలిఫోర్నియాలో క్యూపెర్టినో ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జూన్ 8 నుంచి జూన్ 12 వరకు డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 ఈవెంట్ జరగనుంది. ఈరోజు రాత్రి 10:30 గంటలకు ఎంపిక చేసిన డెవలపర్‌ల కోసం సీఈఓ టిమ్ కుక్ ఇచ్చే డైరెక్ట్ కీనోట్‌తో వస్తుంది.
ఈ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ను ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ టీవీ 4K, విండోస్ పీసీలు, స్మార్ట్ టీవీలు, ఇతర డివైజ్‌లతో ఆపిల్ టీవీ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ ఆపిల్ డెవలపర్ యాప్, ఆపిల్ డెవలపర్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
