HUAWEI Mate 90 : సూపర్ ఫోన్ భయ్యా.. హువావే మేట్ 90 అదుర్స్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. ధర తెలిస్తే షాక్..!

HUAWEI Mate 90 : హువావే చైనాలో మేట్ 90 సిరీస్‌ను విస్తరించింది. హువావే మేట్ 90 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర, ఫీచర్ల వివరాలివే..

HUAWEI Mate 90 Introduced

  • హువావే మేట్ 90లో 6,600mAh బ్యాటరీ సెటప్
  • 6.75-అంగుళాల ఓఎల్ఈడీ FHD ప్లస్ డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌

HUAWEI Mate 90 : హువావే నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో మేట్ 90 సిరీస్‌ను విస్తరించింది. హువావే మేట్ 90 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ చేసింది. ఈ మేట్ 90లో 50MP ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

6,600mAh బ్యాటరీని అమర్చారు. 66W ఫాస్ట్ ఛార్జింగ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో కిరిన్ 9030 చిప్‌సెట్ 12GB ర్యామ్ ఉన్నాయి. హువావే మేట్ 90 ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

హువావే మేట్ 90 ధర లభ్యత :
హువావే మేట్ 90 ధర 12GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 5,999 యువాన్లు (సుమారుగా రూ. 86,145), 12GB+512GB స్టోరేజ్ వేరియంట్‌కు 6,999 యువాన్లు (సుమారుగా రూ. 100,505), 12GB+1TB స్టోరేజ్ వేరియంట్‌కు 8,499 యువాన్లు (సుమారుగా రూ. 122,145)గా ఉంది. హువావే మేట్ 90 ప్రస్తుతం చైనాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హువావే మేట్ 90లో 2832×1280 పిక్సెల్స్ రిజల్యూషన్, 1-120Hz ఎల్టీపీఓ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.75-అంగుళాల ఓఎల్ఈడీ FHD+ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం థర్డ్ జనరేషన్ కున్లూన్ గ్లాస్ అందిస్తుంది. ఈ ఫోన్ కిరిన్ 9030 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. హార్మొనీఓఎస్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Xiaomi 17T Price : బాబోయ్.. షావోమీ 17T ఫోన్ ఏకంగా రూ. 10వేలు పెంపు.. కొత్త ధర ఎంతంటే?

సేఫ్టీ కోసం 3డీ ఫేస్ రికగ్నిషన్ సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్, eSIM, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, GPS, USB టైప్-సి 3.1 జెన్ 1 పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 161.9mm పొడవు, 75.7mm వెడల్పు, 7.95mm ఎత్తు ఉంటుంది. బరువు 217 గ్రాములు ఉంటుంది.

ఈ ఫోన్ బ్యాక్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.4-ఎఫ్/4.0 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP అల్ట్రా-వైడ్ జూమ్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP సూపర్ ఫోకస్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్ 3డీ డెప్త్ సెన్సింగ్‌కు సపోర్ట్ చేసే ఎఫ్/2.0 అపర్చర్‌తో 13MP అల్ట్రా-వైడ్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో 6,600mAh బ్యాటరీ ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డస్ట్, హై టెంపరేచర్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ ఉంది.