Huawei Pura 90 Series : కొత్త హువావే పురా 90 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 14నే గ్లోబల్ లాంచ్.. ప్రో మ్యాక్స్ ఫీచర్లు లీక్..!
Huawei Pura 90 Series : హువావే నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. హువావే పురా 90 సిరీస్ అతి త్వరలో ఆవిష్కరించనుంది. జూలై 14న ప్రపంచ మార్కెట్లలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
- Sreehari A
- Published on- July 6, 2026 / 10:44 PM IST
Huawei Pura 90 Series
- చైనాలో గత ఏప్రిల్‌లో హువావే పురా 90 సిరీస్ రిలీజ్
- చైనీస్ వేరియంట్లలో 6,000mAh బ్యాటరీలు ఉంటాయి
- హువావే పురా 90 ప్రోలో 6.6-అంగుళాల డిస్‌ప్లే ఉంది
Huawei Pura 90 Series : హువావే ఈ ఏడాది ప్రారంభంలో చైనా మార్కెట్లో సొంత కిరిన్ 9000 సిరీస్ చిప్‌సెట్‌లతో పురా 90, పురా 90 ప్రో, పురా 90 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వచ్చే వారం పురా 90 లైనప్ ఇతర ప్రపంచ మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్టు బ్రాండ్ ధృవీకరించింది.
ఈ లాంచ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏయే మోడళ్లు అందుబాటులో ఉంటాయో హువావే ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే హువావే పురా 90ఎస్ ప్రో మాక్స్‌ను టీజ్ చేసింది. పురా 90 సిరీస్ చైనీస్ వేరియంట్లు హార్మొనీఓఎస్ 6.1పై రన్ అవుతాయి. 6,000mAh బ్యాటరీతో వస్తాయి.
వచ్చే వారమే మలేషియాలో లాంచ్ :
గ్లోబల్ మార్కెట్లలో జూలై 14న లాంచ్ ఈవెంట్‌లో హువావే పురా 90 సిరీస్ ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘నౌ ఈజ్ యువర్ మూమెంట్’ అని పేరుతో ఈ లాంచ్ ప్రొగ్రామ్ వచ్చే వారం మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరగనుంది.
ఈ సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఎన్ని పురా 90 మోడళ్లను లాంచ్ చేయనుందో హువావే వెల్లడించలేదు. కానీ, హువావే పురా 90s ప్రో మాక్స్ అనే కొత్త మోడల్‌ను మాత్రం సంస్థ రివీల్ చేసింది. ప్రపంచ మార్కెట్ల కోసం హువావే పురా 90 ప్రో మాక్స్‌ను పురా 90ఎస్ ప్రో మాక్స్‌గా రీబ్రాండ్ చేసే అవకాశం ఉంది.
హువావే పురా 90S ప్రో మ్యాక్స్ కెమెరాలతో సరికొత్త టీజర్ లాంచ్ చేసింది. హై జూమ్ లెవల్స్ ఫొటోలు తీయొచ్చు. ఇందులో 20x టెలిఫోటో జూమ్ కెమెరా ఉంటుంది. ఈ బ్రాండ్, హువావే పురా 90S ప్రో మ్యాక్స్‌తో పాటు స్టాండర్డ్ హువావే పురా 90, హువావే పురా 90 ప్రోలను కూడా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.
హువావే పురా 90 సిరీస్ ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ అయింది. బేస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర CNY 4,699 (సుమారుగా రూ. 64వేలు) ఉంటుంది. హువావే పురా 90 ప్రో ఫోన్ 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హువావే పురా 90 ప్రో మాక్స్ భారీ 6.9-అంగుళాల ప్యానెల్‌తో వస్తుంది.
ఈ రెండు మోడళ్లు కిరిన్ 9030S చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. స్టాండర్డ్ హువావే పురా 90, 6.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. కిరిన్ 9010S ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లు హార్మొనీఓఎస్ 6.1తో వస్తాయి. 6,000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి.
