AI Impact Summit Day 2
AI Impact Summit Day 2 : భారత్ ఫస్ట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సాధారణ ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా మొదటి రోజు భారీ రద్దీ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ప్రపంచ నేతలు, సాంకేతిక ప్రముఖులు, స్టార్టప్‌ల ముందు తమ లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించాయి.
ఈ సమ్మిట్ రెండో రోజు నుంచి సాధారణ ప్రజలు కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. జేపీ నడ్డా, సుందర్ పిచాయ్ ఇతరులతో సహా అనేక మంది అతిథులు ఈ వేదికగా కీలక ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. మీరు రెండో రోజు భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్లాన్ చేస్తుంటే.. ట్రాఫిక్ అడ్వైజరీ, ఫ్రీ పాస్‌లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డే 2 : పబ్లిక్ ఎంట్రీ, వెన్యూ, టైమింగ్స్ ఇవే :
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఈరోజు నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏఐ మెగా ఈవెంట్‌కు ప్రాథమిక వేదిక న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపం కొన్ని కార్యక్రమాలు చాణక్యపురిలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జరుగుతాయి. ప్రధానంగా ఉన్నత స్థాయి విధాన సెమినార్లు ఇందులో నిర్వహిస్తుంటారు. ఈ సెమినార్లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగుస్తాయి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డే 2 : ట్రాఫిక్ అడ్వైజరీ :
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2వ రోజున వీవీఐపీలు ఎక్కువ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మధుర రోడ్, భైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్‌లలో భారీ రద్దీగా ఉంది. అడపాదడపా రోలింగ్ మూసివేతలు ఉండొచ్చు.
నార్త్ నుంచి సౌత్ వైపు వెళ్లే ప్రయాణికులు రింగ్ రోడ్ లేదా సారాయ్ కాలే ఖాన్ మీదుగా ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్లే వారు బారాపుల్లా ఎలివేటెడ్ రోడ్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. సాధారణ ప్రజలు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి ఉచితంగా హాజరు కావచ్చు. అయితే, లిమిటెడ్ స్పేస్ కారణంగా వ్యక్తిగత రిజిస్ట్రేషన్లు ఫిల్ అయిపోయాయని అధికారిక వెబ్‌సైట్ సూచిస్తుంది.
ఫ్రీ పాస్ ఎలా పొందాలి :