Infinix Hot 70 Pro 5G : సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్..!

Infinix Hot 70 Pro 5G : ఇన్ఫినిక్స్ 5జీ ఫోన్ థర్మో ఆరెంజ్ కలర్ వేరియంట్ బ్యాక్ ప్యానెల్ టెంపరేచర్ అనుగుణంగా మారుతుంది. సిల్క్ గ్లో పర్పుల్ వేరియంట్ టెక్స్చర్ మూవెంట్ బట్టి మారుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని డైవ్ బ్లూ కలర్ వేరియంట్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది.

Infinix Hot 70 Pro 5G

  • మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ఉంది
  • 6.76-అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లే
  • 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
  • గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల

Infinix Hot 70 Pro 5G : ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతుంది. చైనాకు మొబైల్ మేకర్ ఇన్ఫినిక్స్ అతి త్వరలో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ 4 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో రిలీజ్ అయింది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో వర్క్ అవుతుంది.

సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో భారత మార్కెట్లో ఈ ఇన్ఫినిక్స్ 5జీ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ (Infinix Hot 70 Pro 5G) ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ డైవ్ బ్లూ, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్ థర్మో ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ దేశంలో కంపెనీ వెబ్‌సైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుంది :

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లోని థర్మో ఆరెంజ్ కలర్ వేరియంట్ బ్యాక్ ప్యానెల్ టెంపరేచర్ అనుగుణంగా మారుతుంది. సిల్క్ గ్లో పర్పుల్ వేరియంట్, టెక్స్చర్ మూవెంట్ అనుగుణంగా మారుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని డైవ్ బ్లూ కలర్ వేరియంట్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీలో యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (AMC) రియర్ లైటింగ్ సిస్టమ్ ఉంది. కస్టమైజడ్ ఈ మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే నోటిఫికేషన్‌లు, గేమింగ్ ఛార్జింగ్ స్టేటస్ బ్లింక్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ 6.76-అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో వస్తుంది.

కెమెరా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G రియర్ కెమెరా 50MP కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. 5,600mAh లేదా 6,000mAh బ్యాటరీ ఉండొచ్చు. ఇందులో బ్యాటరీ ఏదైనా 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

గత నెలలో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫ్రాస్ట్ సిల్వర్ మిస్ట్ టైటానియం అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. ఈ కొత్త కలర్ ఆప్షన్లలో మెటాలిక్ ఫినిషింగ్‌ అందించనుంది. అయితే, ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.78-అంగుళాల యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది.