Infinix Note 60 Pro : సూపర్ ఫోన్ గురూ.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..
Infinix Note 60 Pro : కొంటే ఇన్ఫినిక్స్ ఫోన్ కొనాలి. భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో సరికొత్త ఫీచర్లతో వచ్చేసింది. 6,500 భారీ బ్యాటరీతో రూ. 31,999 ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : April 13, 2026 / 03:19 PM IST
Infinix Note 60 Pro
- ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో 6.78-అంగుళాల యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ డిస్‌ప్లే
- 50MP ప్రైమరీ కెమెరా, 6500mAh బ్యాటరీ ఆప్షన్, 90W ఫాస్ట్ ఛార్జింగ్
- ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్, ప్రీ-ఆర్డర్లు ప్రారంభం
Infinix Note 60 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి సరికొత్త ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఈ ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ధర :
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 కాగా , 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సోలార్ ఆరెంజ్, డీప్ ఓషన్ బ్లూ, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ అధికారిక సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 3వేలు తగ్గింపుతో సహా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వస్తుంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో 6.78-అంగుళాల యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1208×2644 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 144Hz వరకు, గరిష్ట బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు, స్క్రీన్-టు-బాడీ రేషియో 93.18 శాతం ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 8GB LPDDR5 ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256GB వరకు UFS2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 7.45mm పొడవు, 162.37mm వెడల్పు, 77.17mm మందం, బరువు 200 గ్రాములు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అడ్రినో A810 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోలో ఎఫ్/1.59 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ డ్యూయల్-సిమ్, జీపీఎస్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-C పోర్ట్, OTG, ఎఫ్ఎమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డస్ట్, వాటర్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64-రేటింగ్ కూడా ఉంది.
