Infinix Smart 20 : బడ్జెట్‌లో బీస్ట్ ఎంట్రీ.. రూ. 12,499 ధరకే ఇన్ఫినిక్స్ సూపర్ ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు!

Infinix Smart 20 : లో బడ్జెట్ యూజర్ల కోసం ఇన్ఫినిక్స్ నుంచి సరసమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీ, ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్ తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

Infinix Smart 20

Infinix Smart 20 : ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇన్ఫినిక్స్ ఇండియా అత్యంత సరసమైన ఫోన్‌ తీసుకొచ్చింది. కంపెనీ కొన్ని రోజుల క్రితమే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్ సిరీస్‌లో అందుబాటులో ఉంది. గత ఏడాదిలో లాంచ్ అయిన స్మార్ట్ 10కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ కూడా ఉంది. ఈ రేటింగ్ కారణంగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్ నీళ్లలో తడిసినా, దుమ్ములో పడినా ప్రొటెక్ట్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ధర :
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 4GB ర్యామ్ + 64GB, 4GB ర్యామ్ + 128GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 12,499 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 13,999కు లభిస్తుంది.

ఈ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ రూ. 10,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ క్లౌడ్‌లైన్ బ్లూ, పోలారిస్ టైటానియం, షాడో బ్లాక్, సన్‌లైక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

Read Also : Xiaomi 2026 TV FX Mini LED : సూపర్ స్మార్ట్‌టీవీలు గురూ.. మినీ LEDలో షావోమీ మాస్టర్ స్ట్రోక్.. థియేటర్ ఫీలింగ్ ఇంట్లోనే!

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫీచర్లు :

డిస్‌ప్లే  : 6.78 అంగుళాలు, HD+, 120Hz
ప్రాసెసర్ :  మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్
స్టోరేజీ  : 4GB RAM, 128GB
కెమెరా : 8MP, 8MP
బ్యాటరీ  : 5,200mAh, 10W
ఓఎస్  : ఆండ్రాయిడ్ 15

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ సరసమైన ధరలో అందుబాటులో ఉంది. 6.78-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ ఫోన్ ర్యామ్, స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ 4G, LTE, WiFi, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌లో 8MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం మరో 8MP కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్ కూడా ఉంది. పవర్‌ఫుల్ 5,200mAh బ్యాటరీతో వస్తుంది.

USB టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనికి IP64 రేటింగ్ కూడా ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది.