Infinix Smart 20 : 5200mAh బ్యాటరీతో ఫుల్-డే పవర్! బడ్జెట్ కింగ్ ఇన్ఫినిక్స్ ఫోన్ అద్భుతం.. ధర మీ బడ్జెట్‌లోనే!

Infinix Smart 20 Phone : ఇన్ఫినిక్స్ నుంచి అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ 20 ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 8న భారత మార్కెట్లో మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది.

Infinix Smart 20 Phone

  • ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో 5,200mAh బ్యాటరీ స్పెషల్
  • మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ చిప్‌సెట్‌ సెటప్
  • అత్యంత సన్నగా కేవలం 7.7 మి.మీ. మందం మాత్రమే

Infinix Smart 20 Phone : కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్‌ను కంపెనీ జూన్ 8న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ ఈ లేటెస్ట్ ఫోన్‌లో పవర్‌ఫుల్ ప్రాసెసర్‌గా మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ చిప్‌సెట్ అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను కేవలం 7.7mm మందంతో చాలా స్లిమ్ ప్రొఫైల్‌లో అందిస్తోంది. IP64 రేటింగ్ కూడా ఉంటుంది. లాంచ్ ముందే ఈ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 లైవ్ స్ట్రీమింగ్ :
జూన్ 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 లాంచ్ కానుంది. ఆ తర్వాత ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉండనుంది. ఈ లాంచ్ ఈవెంట్ కంపెనీ సోషల్ మీడియా ఛానెళ్లలో చూడొచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో స్పెసిఫికేషన్లన్నింటినీ వెల్లడించింది.

Read Also : Vodafone Idea : Jio, Airtelకి పోటీగా Vi బిగ్ ఆఫర్.. 365 రోజుల ప్లాన్‌తో OTT భారీ బెనిఫిట్స్!

భారత్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ధర :
కంపెనీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ధర ఎంతో రివీల్ చేసింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 11,999 నుంచి ఉంటుంది. క్లౌడ్‌లైన్ బ్లూ, పోలారిస్ టైటానియం, షాడో బ్లాక్, సన్‌లైక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే భారీ 6.78-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ పంచ్-హోల్ డిజైన్‌తో వస్తుంది. కంపెనీ ఫ్లాట్ ఫ్రేమ్‌తో 3D కాంపోజిట్ రియర్ ప్యానెల్‌ అందించింది. ఇది కేవలం 7.7mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 4GB ర్యామ్, 2TB వరకు స్టోరేజ్ అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో 5,200mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌లో కంపెనీ 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 39 రోజుల స్టాండ్‌బై టైమ్ అందిస్తుంది.

అంతేకాదు.. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో అల్ట్రా లింక్ అనే స్పెషల్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య కిలోమీటరు రేంజ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ యాక్సస్ పొందవచ్చు.