Infinix Smart 8 Sale : ఐఫోన్ 16 డైనమిక్ ఐలాండ్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్.. సేల్ మొదలైందోచ్.. ధర ఎంతంటే?

Infinix Smart 8 Sale : ఆపిల్ ఐఫోన్ 15 మాదిరి ఫీచర్లతో ఇప్పుడు ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ అమ్మకానికి ఉంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలో ఈ ఫోన్ టాప్-నాచ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Smart 8 with iPhone 15-like dynamic island goes on sale today

Infinix Smart 8 Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎంట్రీ లెవల్ లైనప్‌లో మరో కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్ మొదలైంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధర ట్యాగ్ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ టాప్ రేంజ్ స్పెసిఫికేషన్‌లతో అందరి దృష్టిని ఆకర్షించే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్‌లో ప్రత్యేక ఆకర్షణీయమైన ఫీచర్ డైనమిక్ ఐలాండ్ కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 15 అన్ని మోడళ్ల ప్రో వేరియంట్‌లలో కనిపించే డిజైన్‌ను కలిగి ఉంది. ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ఇప్పుడు అధికారికంగా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ధర ఎంతంటే? :
ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ ధర రూ. 6749కు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 15 Sale : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ. 12వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

ఇన్పినిక్స్ స్మార్ట్ 8 స్పెసిఫికేషన్‌లు :
ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ మోడల్ 50ఎంపీ డ్యుయల్ కెమెరాతో క్వాడ్-ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డైనమిక్ ఎక్స్‌పాండబుల్ నాచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ప్రత్యేకమైన ఫీచర్‌గా 50ఎంపీ కెమెరా, అసాధారణమైన ఫొటోగ్రఫీ, ప్రీమియం ఎండ్ ఐకానిక్ కెమెరా మాడ్యూల్ స్మార్ట్ 8 కూడా 8ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే, ఏ లైటింగ్ స్థితిలోనైనా అద్భుతమైన సెల్ఫ్-పోర్ట్రెయిట్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ 8 ఫేస్ అన్‌లాక్ ఫంక్షన్‌, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది.

Infinix Smart 8 on sale today

ఇన్పినిక్స్ స్మార్ట్ వేగవంతమైన, సురక్షితమైన యాక్సెస్‌ అందిస్తుంది. ఈ డివైజ్ మొదటి-ఇన్-సెగ్మెంట్ 6.6హెచ్‌డీ+ పంచ్-హోల్ 90హెచ్‌జెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మ్యాజిక్ రింగ్ ఫంక్షనాలిటీ ద్వారా దృశ్యపరంగా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆక్టా-కోర్ సీపీయూ మాలి-జీ57 ఎంసీ1 జీపీయూతో సమర్థవంతమైన మీడియాటెక్ జీ36 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. స్మార్ట్ 8 మల్టీ టాస్కింగ్, సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ మెమ్‌ఫ్యూజన్ ద్వారా 8జీబీ వరకు విస్తరించవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఎక్స్ఓఎస్ 13 వెర్షన్‌తో ఆండ్రాయిడ్ 13 గో రన్ అవుతుంది. స్మార్ట్ 8 మెరుగైన పర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేసిన ఇంటర్‌ఫేస్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 90హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ అవుతుంది. రోజంతా వినియోగదారులను స్మార్ట్ 8 బలమైన 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

టైప్-సి ఛార్జింగ్, పవర్ మారథాన్ టెక్నాలజీతో వినియోగదారులు తరచుగా రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా ఆస్వాదించవచ్చు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అత్యాధునిక టెక్నాలజీని అందించే ఇన్పినిక్స్ 8 ఫోన్ ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో సహా సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Read Also : New Jawa 350 Motorcycle : కొత్త జావా 350 బైకు వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు