×
Ad

Instagram Reel : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ పాత రీల్స్‌ మళ్లీ చూడొచ్చు.. వెరీ సింపుల్ భయ్యా..!

Instagram Reel : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు రీల్స్ వాచ్ హిస్టరీ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ ఇప్పుడు షార్ట్ వీడియోలను మళ్లీ చూసేందుకు అనుమతిస్తుంది.

Instagram Reel

Instagram Reel : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు పండగ చేస్కోండి. మెటా కంపెనీ సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్ వాచ్ హిస్టరీ’ సరికొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇప్పటికే చూసిన షార్ట్ వీడియోలను తిరిగి చూడవచ్చు. మీరు లైక్ లేదా సేవ్ చేయడం మర్చిపోయిన రీల్ కోసం సెర్చ్ చేయాల్సిన పనిలేదు.

వాచ్ హిస్టరీ ఫీచర్ ఇప్పుడు భారత్ సహా (Instagram Reel) ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా యూజర్లందరికి అందుబాటులో తీసుకొచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. ఈ కొత్త ఫీచర్ కంటెంట్ సులభంగా గుర్తించడమే కాకుండా రీల్స్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుంది. ఇంతకీ ఈ రీల్ వాచ్ హిస్టరీ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్ వాచ్ హిస్టరీ ఫీచర్ ఏంటి? :
ఇప్పటివరకు, ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో రీల్స్‌ను చూసేందుకు ఎలాంటి ఆప్షన్ లేదు. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రమే తెలుస్తుంది. కానీ, ఈ కొత్త అప్‌డేట్‌తో ఇన్‌స్టాగ్రామ్ చివరకు కొత్త వాచ్ హిస్టరీ సెక్షన్ ప్రవేశపెట్టింది. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఏళ్ల తరబడి ఈ ఫీచర్ అందిస్తుంది.

Read Also : Google Pixel 10 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు!

ఈ సెక్షన్ ద్వారా గతంలో చూసిన అన్ని రీల్స్‌ను చూడొచ్చు. అలాగే వాటిని కస్టమైజ్ చేయడం లేదా ఫిల్టర్ చేసే ఆప్షన్ కలిగి ఉంటుంది. మోస్సేరి ప్రకారం.. యూజర్లు తమ వీడియోలను తేదీ వారీగా, పాతది నుంచి కొత్తది వరకు కస్టమైజ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట తేదీ రేంజ్ లేదా క్రియేటర్ ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ వాచ్ హిస్టరీని ఎలా చూడాలి? :

  • ఇన్‌స్టాగ్రామ్‌లో మీ రీల్స్ వాచ్ హిస్టరీని చూడటం చాలా ఈజీ.
  • మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కి వెళ్లండి.
  • టాప్ రైట్ సైడ్ ఉన్న త్రి-లైన్ల మెనుని ట్యాప్ చేయండి.
  • సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి.
  • యూవర్ యాక్టివిటీకి వెళ్లండి.
  • హిస్టరీ బటన్ ట్యాప్ చేయండి.

ఇటీవల చూసిన రీల్స్ ఫిల్టర్ టూల్స్‌తో పాటు చూడగలరు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో లేదు. భారత్ సహా అనేక దేశాలలోని యూజర్లు తమ యాప్‌లను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసినవారికి ఫీచర్
అందుబాటులోకి వచ్చింది.