×
Ad

Passwords Leak : మీ పాస్‌వర్డ్ ఇదేనా? టాప్‌లో ‘12345’.. అర్జెంట్‌గా మార్చుకోండి.. 2025లో లీకైన టాప్ 10 పాస్‌వర్డ్‌లు ఇవే!

Passwords Leak : 2025లో మిలియన్ల కొద్ది పాస్‌వర్డులు లీక్ అయ్యాయి. అందులో టాప్ 100లో ఎక్కువగా నెంబర్లనే వాడుతున్నారట.. రిపోర్టులో షాకింగ్ విషయాలివే..

Passwords Leak

Passwords Leak : మీ పాస్‌వర్డ్ హ్యాకర్లకు తెలుసు.. అవును మీరు చదివింది నిజమే.. ఈజీగా గుర్తు ఉంటుందిలేనని ఇలాంటి పాస్‌వర్డులను పెట్టుకుంటున్నారా? మీ డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ చాలామంది ఇంటర్నెట్ యూజర్లు పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఇటీవలి సర్వేలో తేలింది. 2025లో లక్షలాది మంది ఇప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ పాస్‌వర్డ్‌లను వాడుతున్నారట.

కంపారిటెక్ కొత్త రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలో (Passwords Leak) అత్యంత సాధారణ పాస్‌వర్డ్ మరోసారి “123456” టాప్‌లో నిలిచింది. ఈ ఏడాదిలో రియల్ డేటా ఉల్లంఘనల నుంచి 2 బిలియన్లకు పైగా లీక్ అయిన పాస్‌వర్డ్‌లను పోర్టల్ విశ్లేషించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అనేక మంది ఇంటర్నెట్ యూజర్లు 123456, 12345678, 123456789 అనే మూడు టాప్ పాస్‌వర్డ్‌లను మిలియన్ల కొద్దీ అకౌంట్లు ఉపయోగించాయి. మొదటి 10 ర్యాంకుల్లో ‘admin, password, 12345’ వంటివి ఎక్కువగా వాడినట్టు గుర్తించారు.

Read Also : Vivo X100 Pro : ఔట్‌స్టాండింగ్ డీల్ భయ్యా.. వివో X100 ప్రో అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

అత్యధికంగా వాడే టాప్ 10 పాస్‌వర్డ్‌లివే :

  • 123456
  • 12345678
  • 123456789
  • admin
  • 1234
  • Aa123456
  • 12345
  • password
  • 123
  • 1234567890

కామన్ వర్డ్స్, ఈ పదాలే తెగ వాడుతున్నారట :
వాస్తవానికి, టాప్ 1,000 పాస్‌వర్డ్‌లలో దాదాపు నాలుగింటిలో ఒకటి నెంబర్లు మాత్రమే కలిగి ఉంది. మూడో వంతు కన్నా ఎక్కువ (38.6శాతం) ‘123’ సీక్వెన్స్ కలిగి ఉంది. కొంతమంది యూజర్లు కొంచెం క్రియేటివిటీగా మారారు. టాప్ 1,000 ఎంట్రీలలో దాదాపు 4శాతం లో “password” వేరియేషన్స్ కనిపించాయి.

అయితే “Admin” 2.7శాతంలో కనిపించింది. కంపారిటెక్ ప్రకారం.. “qwerty”, “welcome” కూడా కనిపించాయి. ఆ తర్వాత “minecraft” అనే పాస్‌వర్డ్ అత్యధికంగా ఉపయోగించిన 100వ పాస్‌వర్డ్‌గా నిలిచింది. దాదాపు 90వేల సార్లు కనిపించింది.

‘India@123’ టాప్ 100లో 53వ ర్యాంక్‌లో ఉంది. ఎక్కువ మంది ఇదే పాస్‌వర్డ్ వాడేస్తున్నారు. చాలా మంది నిపుణులు పాస్‌వర్డ్ లెన్త్ కనీసం 12 అక్షరాలు ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. పాస్‌వర్డ్ లెన్త్ పెంచడం వల్ల క్రాక్ అయ్యే అవకాశాలు భారీగా తగ్గుతాయి. కానీ, రిపోర్టు ప్రకారం.. 65.8శాతం పాస్‌వర్డ్‌లు 12 అక్షరాల కన్నా తక్కువ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.