iPhone 17 Pro Series : ఆపిల్ లవర్స్ రెడీనా.. ఈ రెండు ఐఫోన్లు భారీగా తగ్గాయ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

iPhone 17 Pro Series : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ఆపిల్ డివైజ్ లను ఏకంగా రూ. 10వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published on- September 21, 2026 / 06:41 PM IST

iPhone 17 Pro Series

  • క్రోమా ఇండియాలో ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,30,490
  • ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,43,990
  • హై-వేరియంట్లపై రూ. 6,910 వరకు ఆదా
  • ఈ ఐఫోన్లపై క్రోమా స్టోర్లలో రూ. 2వేలతో బుకింగ్

iPhone 17 Pro Series : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు.. క్యుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవలే సెప్టెంబర్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్‌ను ఆవిష్కరించింది. అయితే, కంపెనీ ఐఫోన్ 17 ప్రో 17 ప్రో మాక్స్ అధికారిక సేల్స్ నిలిపివేసింది. అయినా, ఇప్పటికీ ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

షాపింగ్ ప్లాట్‌ఫామ్ క్రోమా ‘ఆపిల్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్’ బ్యానర్ కింద ఐఫోన్ 17 ప్రో సిరీస్‌పై మునుపెన్నడూ లేని ధరలను (iPhone 17 Pro Series) అందిస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలుదారులు క్రోమా స్టోర్లలో రూ. 2వేలకే ఈ ఐఫోన్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ధరల వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఐఫోన్ 17 ప్రో ధర :
క్రోమాలో ఐఫోన్ 17 ప్రో బేస్ మోడల్ ధర రూ. 1,30,490గా ఉంది. అసలు ధరపై రూ. 4,410 ఆదా అవుతుంది. 512GB, 1TB వేరియంట్లు వరుసగా రూ. 1,49,990 రూ. 1,69,490 ధరలకు లభిస్తున్నాయి. దాంతో అసలు ధరపై వరుసగా రూ. 4,910, రూ. 5,410 ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB) అసలు ధరపై రూ. 5,910 ఆదాతో రూ. 1,43,990కి లభిస్తోంది. 512GB, 1TB 2TB వేరియంట్లు వరుసగా రూ. 1,63,990, రూ. 1,83,990 రూ. 2,22,990 ధరలకు లిస్ట్ అయ్యాయి. ఎలాంటి బ్యాంక్ కార్డులు లేకుండా అసలు ధరపై రూ. 6,910 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ హై వేరియంట్ల లభ్యత, కలర్ ఆప్షన్లు అనేవి ఆయా ప్రాంతాలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

Read Also : Samsung Galaxy Z Fold 8 Ultra : ఏంది భయ్యా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ మరి ఇంత తక్కువా..!

బ్యాంకు డిస్కౌంట్లు :
కొనుగోలుదారులు ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై రూ. 10వేల వరకు 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. క్రోమా అధికారిక సైట్ ప్రకారం.. టాటా న్యూ ఎస్బీఐ లేదా HDFC బ్యాంక్ హోల్డర్లు ఎంపిక చేసిన ఆపిల్ ప్రొడక్టులపై 10 శాతం వరకు న్యూకాయిన్‌లను పొందవచ్చు.

ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఎక్స్చేంజ్ ఆఫర్లు :
అదనపు స్టోర్ ఆఫర్ల విషయానికి వస్తే.. కస్టమర్ల పాత డివైస్ ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ. 30వేలు దాటితే, రూ. 12వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. రూ. 18వేల నుంచి రూ. 29,999 మధ్య ఎక్స్ఛేంజ్ వాల్యూకు ఎక్స్ఛేంజ్ బోనస్ గరిష్టంగా రూ. 8వేలు మాత్రమే ఉంటుంది.

రూ. 15వేల నుంచి రూ. 17,999 ఎక్స్చేంజ్ వాల్యూ, బోనస్ మొత్తం రూ. 6వేలుగా ఉంటుంది. ఇంకా, రూ. 10వేల నుంచి రూ.14,999, రూ. 3వేల నుంచి రూ. 9,999 మధ్య ఎక్స్చేంజ్ వాల్యూ బోనస్ వరుసగా రూ. 4వేలు, రూ. 3వేలుగా ఉంటుంది.