iPhone 17 Pro Max : దిమ్మతిరిగే ఆఫర్ మావా.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్

iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గింపు పొందింది. ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 30,000 చౌకగా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను మీరు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

iPhone 17 Pro Max

  • ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గింది
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ రూ. 1,49,900కు సేల్
  • క్రెడిట్ కార్డు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు

iPhone 17 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్.. కొత్త ఆపిల్ ఐఫోన్‌ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్. క్రెడిట్ కార్డులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఆపిల్ అందించే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పటికీ ప్రీమియం కేటగిరీలో ఆధిపత్యం చెలాయిస్తోంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి టాప్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీ డిస్‌ప్లే, పవర్ ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. మీరు కొనాలని అనుకుంటే ఈ ఐఫోన్ మోడల్ రూ. 30వేలు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆఫర్‌ ఎలా? :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ రూ. 1,49,900కు అమ్ముడవుతోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారు రూ. 4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ దగ్గర పాత ఐఫోన్‌ ఉంటే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

Read Also : Renault Duster 2026 : ఈ కారుకు మార్కెట్లో ఫుల్ క్రేజ్.. కొత్త రెనాల్ట్ డస్టర్ కోసం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? నెలకు EMI లెక్కలివే..!

ఒకవేళ ఎవరైనా ఐఫోన్ 13 ఎక్స్ఛేంజ్ చేసుకుంటే పాత ఐఫోన్‌కు రూ. 25,350 వరకు తగ్గింపు పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లతో ఎక్స్చేంజ్ చేస్తే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. ఫైనల్ అమౌంట్ స్మార్ట్‌ఫోన్ మోడల్, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. బ్యాంకు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ వాల్యూతో మొత్తం దాదాపు రూ. రూ. 30వేల వరకు ఉండవచ్చు.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇందులో సరికొత్త A19 ప్రో చిప్‌సెట్ ఉంది. హెవీ టాస్కులను కూడా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఈ ఐఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ ఐఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ సెటప్ ఉంది.

మెయిన్, అల్ట్రావైడ్, 4x టెలిఫోటో అనే మూడు 48MP సెన్సార్లు ఉన్నాయి. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ USB-C ఛార్జింగ్‌తో పాటు MagSafe కూడా సపోర్ట్ చేస్తుంది.

USB-C ఛార్జింగ్, MagSafeకు కూడా సపోర్టు ఇస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్..