iPhone 18 Pro Diwali Sale : దీపావళి బంపర్ సేల్.. ఐఫోన్ 18 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..
iPhone 18 Pro Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ఐఫోన్ 18 ప్రోపై ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయి.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, ధర, ఫీచర్లు, కెమెరా వివరాలివే..
- Sreehari A
- Published on- October 30, 2026 / 08:38 PM IST
iPhone 18 Pro Diwali Sale
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి పండుగ సేల్ ఆఫర్లు
- ఐఫోన్ 18 ప్రో తగ్గింపు ధరకే లభిస్తోంది
- ఆపిల్ A20 ప్రో ప్రాసెసర్, 48MP మెయిన్ కెమెరా
iPhone 18 Pro Diwali Sale : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి దీపావళి సేల్ అద్భుతమైన అవకాశం.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 18 ప్రోపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తోంది.
ధర తగ్గింపులు, బ్యాంక్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫోన్ కొనుగోలుతో పాటు పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకునేవారికి కూడా అదనపు బెనిఫిట్ లభించనుంది.. పూర్తి ఆఫర్, ధర వివరాలివే..
ఐఫోన్ 18 ప్రో ధర ఎంతంటే? :
ఐఫోన్ 18 ప్రో 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,64,900గా ఉంది. అయితే, దీపావళి ప్రత్యేక విక్రయాల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ ధర రూ.1,58,900కు చేరుతుంది.
Read Also : Samsung Galaxy S25 Ultra : ఆఫర్ అంటే ఇది.. ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ ఇంత తక్కువా? ఇలా కొన్నవారికే..!
అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.76,200 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ పొందవచ్చు. అయితే, ఈ మొత్తం ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించదు. మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, పర్ఫార్మెన్స్, ఎక్స్‌ట్రనల్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూ మారుతుంది. కొనుగోలు చేసే ముందు ఫైనల్ ధరను చెక్ చేసుకోవడం బెటర్..
ఫ్లాగ్షిప్ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు :
ఈ మోడల్లో 6.3 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 1320×2868 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 1,600 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ కోసం ఆపిల్ A20 ప్రో చిప్సెట్, సాఫ్ట్వేర్ పరంగా iOS 27 అందిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం బ్యాక్ సైడ్ మూడు 48MP కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ సెన్సార్‌లో వేరియబుల్ అపర్చర్, ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది..
కొనేముందు ఇలా చేయండి :
ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. అయితే, బ్యాంక్ డిస్కౌంట్ అర్హత, స్టాక్ లభ్యత, ఎక్స్ఛేంజ్ వాల్యూ వంటి వివరాలను ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసిన తర్వాతే కొనేసుకోవడం బెటర్..
