iPhone 20 : వారెవ్వా.. ఆపిల్ ఐఫోన్ 20 రెండర్లు లీక్.. 200MP కెమెరా, బెజెల్ ఫ్రీ డిజైన్ చూస్తే షాక్ అవుతారు!
iPhone 20 : ఆపిల్ ఐఫోన్ 20 ప్రత్యేక ఫీచర్లతో రాబోతుంది. 200MP కెమెరా, బెజెల్ ఫ్రీ డిజైన్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. ఐఫోన్ 20 రెండర్ల లీక్ డేటా వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- May 24, 2026 / 04:02 PM IST
iPhone 20 renders ( Image Credit : AI )
- ఐఫోన్ 20లో బెజెల్-లెస్ డిజైన్, క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే
- ఫ్రంట్ కెమెరా, ఫేస్‌ఐడీ డిస్‌ప్లే కింద ఉంటాయి
- ఐఫోన్ 20లో ఎలాంటి ఫిజికల్ బటన్ ఉండదు
iPhone 20 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇంకా ఐఫోన్ 18 రాలేదు.. అంతకన్నాముందే ఫ్యూచర్ ఐఫోన్ 20 ఫస్ట్ డిజైన్ లీక్ అయింది. ఆపిల్ కంపెనీ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ బెజెల్-లెస్ డిజైన్‌తో రానుంది. ఈ ఐఫోన్ కొత్త రెండర్ వీడియో రిలీజ్ అయిన వెంటనే సంచలనం సృష్టించింది.
ఈ ఐఫోన్ ఆపిల్ ఐఫోన్ డిజైన్ హిస్టరీని మార్చేస్తుందని అంటున్నారు. రాబోయే ఐఫోన్ 4 కార్నర్లలో గ్లాస్ ఉండవచ్చు. ఫేస్‌ఐడీ డిస్‌ప్లే లోపల ఉంటుంది. లీకైన రెండర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 18 లాంచ్‌కు ముందే.. ఐఫోన్ 20 డిజైన్ లీక్ అయింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఐఫోన్ 20కి సంబంధించిన రెండర్ వీడియో లీక్ అయింది. రెండర్ ప్రకారం.. ఐఫోన్ 20 ప్రొడక్షన్ ఫస్ట్ ఫేస్ మొదలైంది. అంటే.. ఐఫోన్ 20 ప్రొడక్షన్ ప్రారంభమైంది. అయితే, దీనికి సంబంధించి ఆపిల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐఫోన్ 20 రెండర్లు లీక్..
ఐఫోన్ 20 రెండర్ పరిశీలిస్తే.. ఈ ఐఫోన్ డిజైన్ ఐఫోన్‌ల హిస్టరీని మార్చబోతోందని సూచిస్తోంది. ఈ ఐఫోన్ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. ఫ్రంట్, బ్యాక్ పార్టుల్లో అన్ని కార్నర్ గ్లాస్ ఉండనుంది. అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ కూడా ఉంటుంది.
ఐఫోన్‌లో ఎలాంటి ఫిజికల్ బటన్లు లేవు. ఐఫోన్ 18 కొన్ని నెలల్లో లాంచ్ కావచ్చు. అయితే, కంపెనీ ఐఫోన్ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఆ తర్వాతి ఏడాది 2027లో ఐఫోన్ 20ని నేరుగా లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 20 క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. దీనికోసం కంపెనీ శాంసంగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంపెనీ కస్టమ్ OLED ప్యానెల్‌తో వస్తుందని అంచనా. డిజైన్‌లో డైనమిక్ ఐలాండ్ ఎత్తేయనుంది.
ఇక ఐఫోన్లకు బటన్లు ఉండవు :
ఫ్రంట్ కెమెరా, ఫేస్‌ఐడీ పూర్తిగా డిస్‌ప్లే కిందకు మారవచ్చు. ఐఫోన్ బటన్లను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ ఐఫోన్‌లో ఎలాంటి ఫిజికల్ బటన్లు ఉండవు. కంపెనీ వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్‌తో స్ట్రాంగ్ టచ్ కంట్రోల్స్‌ను అందించవచ్చు.
ఈ ఫోన్‌లో కంపెనీ కొత్త A21 చిప్‌సెట్ ఉంటుంది. 2nm ప్రాసెసింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో అడ్వాన్స్ HDR టెక్నాలజీతో 200MP మెయిన్ కెమెరా ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఈ ఫోన్‌లో సిలికాన్ బ్యాటరీని ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించి ఆపిల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
