IPL 2026 Free Plans : HDలో ఐపీఎల్ మజా.. జియో, ఎయిర్‌టెల్, Vi సూపర్ ప్లాన్లు.. ఫ్రీ OTTతో IPL లైవ్ స్ట్రీమింగ్

IPL 2026 Free Streaming Plans: ఐపీఎల్ అభిమానుల కోసం 2026 ఫ్రీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ ఓటీటీతో పాటు లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

IPL 2026 Free Streaming Plans

  • అతి త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్
  • జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలో సరసమైన ప్లాన్లు
  • ఐపీఎల్ స్ట్రీమింగ్ HD క్వాలిటీతో యాక్సస్ చేయొచ్చు

IPL 2026 Free Streaming Plans : ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ క్రికెట్ ఫ్యాన్స్ కోసం లగ్జరీ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.స్టేడియం విజిటింగ్ లేదా ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌ల విషయంలో ఆందోళన అవసరం లేదు.

ఎందుకంటే.. ఈ కంపెనీలు సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో జియోహాట్‌స్టార్‌కు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తున్నాయి.  మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. కేవలం రూ. 101తో చిన్న వోచర్‌ల నుంచి ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్లను పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జియో మ్యాజికల్ ఆఫర్లు :
రిలయన్స్ జియో ఐపీఎల్ 2026 కోసం రూ. 949 ఫ్లాగ్‌షిప్ ప్లాన్ అందిస్తోంది. 84 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను పొందవచ్చు. 5జీ యూజర్లు డేటా పూర్తిగా అన్ లిమిటెడ్ ఉంటుంది. మీకు 3 నెలల పాటు జియోహాట్‌స్టార్‌కు ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు. ఇప్పటికే రీఛార్జ్ యాక్టివ్‌గా ఉంటే రూ. 101 (5GB) లేదా రూ. 195 (15GB) మ్యాజికల్ డేటా వోచర్‌ను పొందవచ్చు. తద్వారా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు.

Read Also : Free AI Videos : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 AI యాప్స్.. ఫ్రీగా వీడియోలు చేయొచ్చు.. లైకులు, కామెంట్లు పక్కా!

ఎయిర్‌టెల్ డేటా ఆఫర్లు :
మీరు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను HDలో చూడాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4GB డేటాను అందిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. అదనంగా, రూ. 1029 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసే ఇబ్బంది ఉండదు. రూ. 3999 వార్షిక ప్లాన్ తీసుకుంటే ఏడాది వారకు అద్భుతమైన ఓటీటీ ఫీచర్లు, బెనిఫిట్స్ అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా చీపెస్ట్ వోచర్లు :
ఐపీఎల్‌ యూజర్ల కోసం వోడాఫోన్ ఐడియా రూ. 101, రూ. 151, రూ. 175 ప్లాన్లతో అద్భుతమైన డేటా ప్యాక్‌లను అందిస్తోంది. 5GB నుంచి 10GB వరకు అదనపు డేటా, స్ట్రీమింగ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. నెల మొత్తం మ్యాచ్‌లను ఎంజాయ్ చేయొచ్చు. వోడాఫోన్ ఐడియా రూ. 248 స్పెషల్ ప్లాన్ బెస్ట్. విద్యార్థులు, యువతకు ఈ చిన్న ప్యాక్‌లు అద్భుతంగా ఉంటాయి.

ఐపీఎల్ ప్లాన్‌ ఎలా ఎంచుకోవాలి? :
మీరు ఐపీఎల్ సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం అనేది మీ నెట్‌వర్క్ కనెక్టివిటీ, డేటా వినియోగంపై ఆధారపడి ఉంటుంది. మీ ప్రాంతంలో జియో 5G స్పీడ్ ఉంటే మ్యాజిక్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ తీసుకోవచ్చు. ఎక్కువ డేటా వాడేవారైతే ఎయిర్‌టెల్ రోజుకు 4GB ప్లాన్ బెస్ట్. మ్యాచ్‌ల సమయంలో ఎక్కువ డేటా మాత్రమే అవసరమయ్యే వారికి వోడాఫోన్ ఐడియా వోచర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.