iQOO Phones Price Hike : ఐక్యూ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఈ iQOO ఫోన్లపై రూ.10వేల వరకు పెంపు.. ఇక కొనడం కష్టమే..!
iQOO Phones Price Hike : ఐక్యూ ఫోన్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఐక్యూ 15, ఐక్యూ 15ఆర్, ఐక్యూ నియో 10 ధరలు ఒక్కసారిగా రూ.10వేల వరకు పెరిగాయి..
- Sreehari A
- Published on- August 16, 2026 / 09:37 PM IST
iQOO Phones Price Hike
- ఐక్యూ 15R ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ. 4వేలు పెంపు
- ఐక్యూ నియో 10 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ. 2వేలు పెంపు
- మెమరీ చిప్ కొరత ఎఫెక్ట్.. భారీగా పెరుగుతున్న ఫోన్ల ధరలు
iQOO Phones Price Hike : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మొబైల్ ఫోన్ల ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ ఖర్చు పెరుగుతోంది. దీని ప్రభావం డివైజ్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒప్పో, వివో, షావోమీ వంటి బ్రాండ్‌లు తమ దాదాపు అన్ని డివైజ్‌ల ధరలను ఇప్పటికే పెంచేశాయి.
ఇప్పుడు, వివో సబ్-బ్రాండ్ ఐక్యూ (iQOO) కూడా తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను ఒక్కసారిగా పెంచింది. గత కొద్ది రోజుల్లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ధరలను భారీగా పెంచడం ఇదే ఫస్ట్ టైమ్.. కంపెనీ ఐక్యూ 15, ఐక్యూ 15R, ఐక్యూ నియో 10 వంటి మోడళ్ల ధరలను భారీగా పెంచేసింది. ఈ ప్రముఖ ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..
కంపెనీ ఐక్యూ 15 ధరను రూ.10వేలు పెంచింది. ఇప్పటివరకు కంపెనీ పెంచిన అతిపెద్ద ధర ఇదే. గతంలో రూ.76,999కి అమ్ముడైన 12GB+256GB వేరియంట్, ఇప్పుడు రూ.85,999కి లభిస్తోంది. అంటే ధర రూ.9వేలు పెరిగింది.
ఈ ఫోన్ 16GB+512GB వేరియంట్ ఇప్పుడు రూ.83,999 నుంచి రూ.93,999కి పెరిగింది. అంటే.. ఈ ఫోన్ ధర రూ.10వేలు పెరిగింది. అసలు ప్రారంభ ధరను చూస్తే.. కంపెనీ ఈ ఫోన్ కేవలం రూ.72,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు రూ.13వేలు ఎక్కువ ధరకు లభిస్తోంది.
ఐక్యూ 15ఆర్ ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ.4వేలు పెరిగింది. ఈ ఫోన్‌ను రూ.53,999కి కొనేసుకోవచ్చు. 12GB+256GB వేరియంట్ ధర రూ.5వేలు పెరిగింది. ఈ ఫోన్‌ను రూ.59,999కి సొంతం చేసుకోవచ్చు. 12GB+512GB వేరియంట్ ధర రూ.5వేలు పెరిగింది. ఈ ఫోన్‌ను రూ.66,999కి కొనేసుకోవచ్చు.
ఐక్యూ నియో 10 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ.2వేలు పెరిగింది. ఈ ఫోన్‌ను రూ.43,999కి కొనేసుకోవచ్చు. అలాగే, 12GB+256GB వేరియంట్ ధర కూడా పెరిగింది. ఈ ఫోన్ రూ.48,999కి ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రారంభ బేస్ ధరతో పోలిస్తే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ.10వేలు ఎక్కువగా ఉంటుంది.
