iQOO 16 Launch : వావ్.. కొత్త ఐక్యూ 16 ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలివే..!
iQOO 16 Launch : రాబోయే స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, గేమింగ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. హీట్ కంట్రోల్ కోసం ఐక్యూ 16లో రీడిజైన్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండొచ్చు.
- Sreehari A
- Updated on- August 16, 2026 / 10:27 PM IST
iQOO 16 Launch
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.85 అంగుళాల ఫ్లాట్ శాంసంగ్ డిస్‌ప్లే ఉండొచ్చు
- ఐక్యూ 16లో రీడిజైన్ రియర్ కెమెరా మాడ్యూల్ సెటప్
- 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అంచనా
iQOO 16 Launch : వివో సబ్-బ్రాండ్ ఐక్యూ నుంచి త్వరలో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. లీక్‌ల ప్రకారం.. ఐక్యూ 16 స్పెసిఫికేషన్లు ముందుగానే రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల చైనా 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టు అయింది.
ఐక్యూ 16లో 2K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఐక్యూ 16 ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌ను వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.85-అంగుళాల ఫ్లాట్ శాంసంగ్ డిస్‌ప్లే ఉంది.
ఐక్యూ 16 మోడల్ క్వాల్‌కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌తో పాటు అడ్రెనో 850 జీపీయూతో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఐక్యూ 16లో కొత్తగా డిజైన్ అయిన రియర్ కెమెరా మాడ్యూల్ ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రోటోటైప్‌లో సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఇందులో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉండొచ్చు.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఐక్యూ 16లో 8,500mAh బ్యాటరీ ఉండొచ్చు. సేఫ్టీ కోసం ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండవచ్చు. ఐక్యూ 16లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్ I2601 మోడల్ నంబర్‌తో IMEI డేటాబేస్‌లో కనిపించింది. మెమరీ చిప్ ధరల పెంపు కారణంగా ఐక్యూ 16 భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ఛాన్స్ లేదు.
Read Also : iQOO Neo 11 Ultra : 2K డిస్‌ప్లే, డైమన్షిటీ 9500Mతో ఫస్ట్ ఫోన్ ఇదే! ఐక్యూ నియో 11 అల్ట్రా లాంచ్ ఎప్పుడంటే?
అయితే, ఈ విషయంపై కంపెనీ ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. రాబోయే స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, గేమింగ్‌కు సపోర్టు చేసే ఫీచర్లను అందించనుంది. హీటింగ్ కోసం ఐక్యూ 16లో రీడిజైన్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది.
గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లో వచ్చిన ఐక్యూ 15లో 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ 6000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.85-అంగుళాల శాంసంగ్ M14 8T ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ అడ్రినో జీపీయూతో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
