iQOO SmartPhones : వావ్.. ఐక్యూ నుంచి 2 ఖతర్నాక్ ఫోన్లు.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?
iQOO 16 Phones : ఐక్యూ 16లో ఎఫ్/1.68 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా ఉంటాయని అంచనా. పూర్తి ఫోన్ వివరాలివే..
- Sreehari A
- Published on- August 21, 2026 / 02:39 PM IST
iQOO 16, Neo 12 Set to Shake
- ఐక్యూ 16లో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో
- ఐక్యూ నియో 12లో 6.83-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉండొచ్చు
- ఈ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో చైనాలో లాంచ్ అయ్యే ఛాన్స్
iQOO 16 Phones : వివో సబ్-బ్రాండ్ ఐక్యూ నుంచి త్వరలో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. ఐక్యూ 16తో పాటు ఐక్యూ నియో 12 కూడా లాంచ్ కానుంది. ఐక్యూ 16లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్, ఐక్యూ నియో 12లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉన్నట్టు అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో హై రిఫ్రెష్ రేట్లు, డిస్‌ప్లేలు ఉంటాయని అంచనా..
టిప్‌స్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ల కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఐక్యూ 16లో 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 6.85-అంగుళాల 2K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఐక్యూ నియో 12లో 185Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉండవచ్చు. ఐక్యూ 16 కోసం అమోల్డ్ ప్యానెల్‌ను శాంసంగ్ నుంచి ఐక్యూ నియో 12 కోసం డిస్‌ప్లే, విజినోక్స్ నుంచి తీసుకోవచ్చు. అయితే, ఐక్యూ దీన్ని ఇంకా రివీల్ చేయలేదు.
ఐక్యూ 16లో ఎఫ్/1.68 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా ఉంటాయని అంచనా. బ్యాక్ ప్యానెల్, టాప్ లెఫ్ట్ కార్నర్ రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 850 జీపీయూతో రన్ అవుతుందని అంచనా.
Read Also : Pova 8 Pro 5G Sale : గేమింగ్ ఫోన్ ఇదిగో.. కొత్త పోవా 8 ప్రో 5జీ ఫస్ట్ సేల్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
ఇందులో స్పెషల్ గ్రాఫిక్స్ చిప్ కూడా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంటాయని అంచనా. ఐక్యూ 16లో 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 8,500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. సేఫ్టీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందని అంచనా.
గత నవంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చిన ఐక్యూ 15 మోడల్ 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. 6.85-అంగుళాల శాంసంగ్ M14 8T ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, అడ్రినో జీపీయూతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6పై రన్ అవుతుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
