iQOO Mini Tablet : ఐక్యూ 16తో అదిరిపోయే కొత్త మినీ టాబ్లెట్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

iQOO Mini Tablet : ఐక్యూ నుంచి ఐక్యూ 16 ఫోన్‌తో పాటు మినీ టాబ్లెట్ కూడా లాంచ్ కాబోతుంది. ఐక్యూ 16తో పాటు ఈ టాబ్లెట్‌ను కంపెనీ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలివే..

iQOO Mini Tablet

  • 2.4GHz, 5GHz వై-ఫై కనెక్టివిటీతో మినీ టాబ్లెట్ రాబోతుంది
  • ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌ ఉండొచ్చు
  • కాంపాక్ట్ సైజులో మినీ టాబ్లెట్, 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా

iQOO Mini Tablet : ఐక్యూ అభిమానులకు పండగే.. కంపెనీ ఫస్ట్ మినీ టాబ్లెట్ వచ్చేస్తోంది. ఈ బ్రాండ్ ఐక్యూ 16 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో పాటు లాంచ్ అవుతుందని అంచనా. ఈ టాబ్లెట్ చైనీస్ సర్టిఫికేషన్‌లో కనిపించింది. ఈ టాబ్లెట్‌లో క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ ఉంటుందని సమాచారం. అంతేకాదు.. భారీ బ్యాటరీ, హై-రిజల్యూషన్ డిస్‌ప్లే కూడా ఉండవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఐక్యూ త్వరలో మార్కెట్లో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేయనుంది. ఈ మినీ టాబ్లెట్ సైజులో కాంపాక్ట్‌గా ఉంటుందని అంచనా. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ టాబ్లెట్ SRRC డేటాబేస్‌లో కనిపించింది. కంపెనీ ఫస్ట్ మినీ టాబ్లెట్ కావచ్చు. ఈ మోడల్ నంబర్ iPA2691గా లిస్టు అయింది.

ఈ సర్టిఫికేషన్ కొన్ని ముఖ్యమైన డేటాను రివీల్ చేసింది. ఈ టాబ్లెట్‌లో 2.4GHz, 5GHz Wi-Fi కనెక్టివిటీ ఉంటుందని అంచనా. బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టాబ్లెట్ కచ్చితంగా Wi-Fi వేరియంట్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Read Also : Realme P4 Lite 5G : మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ రియల్‌మి 5G ఫోన్ రూ. 17,000 తక్కువకే.. ఎలాగంటే?

రాబోయే టాబ్లెట్‌లో సెల్యులార్ కనెక్టివిటీ ఉందని ఎలాంటి సమాచారం లేదు. ఈ టాబ్లెట్ 2nm ప్రాసెసింగ్‌పై స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌తో వస్తుందని సమాచారం. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఐక్యూ 16తో పాటు ఈ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్‌లో 8500mAh బ్యాటరీ ఉండవచ్చని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. సేఫ్టీ కోసం 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుందని అంచనా. పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాది మేలో ఐక్యూ ప్యాడ్ 6 ప్రోను లాంచ్ చేసింది. రాబోయే ఈ టాబ్లెట్ డౌన్‌గ్రేడ్ వెర్షన్ కావచ్చు. ప్యాడ్ 6 ప్రోలో 13.2-అంగుళాల 4K ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ టాబ్లెట్‌లో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 8 స్పీకర్లతో పనోరమిక్ అకౌస్టిక్ సెటప్ ఉంది. హీట్ మేనేజ్ కోసం ఇందులో 3డీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.