iQOO Neo 11 Ultra : బ్యాటరీ బీస్ట్ వచ్చేస్తోంది.. ఐక్యూ నియో 11 అల్ట్రా ఫుల్ ఫీచర్లు లీక్.. లాంచ్ డేట్ ఇదే!

iQOO Neo 11 Ultra : ఐక్యూ నియో 11 అల్ట్రా పలు ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఐక్యూ ఫోన్ ఆగస్టు 18న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా.

iQOO Neo 11 Ultra

  • ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది
  • 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 18న లాంచ్
  • 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్‌లెస్ ఛార్జింగ్
  • 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 6.83-అంగుళాల డిస్‌ప్లే

iQOO Neo 11 Ultra : ఐక్యూ నుంచి ఖతర్నాక్ ఫోన్ వస్తోంది. 10,000mAh బ్యాటరీతో ఐక్యూ త్వరలో పవర్‌ఫుల్ ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ ఐక్యూ ఫోన్ నియో 11 సిరీస్‌లో రానుంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని ముందే ధృవీకరించింది.

ఇందులో అనేక ఫీచర్లను కూడా రివీల్ చేసింది. ఈ ఐక్యూ ఫోన్‌ను ఐక్యూ నియో 11 అల్ట్రాగా చెప్పొచ్చు. కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఐక్యూ జెడ్11ఎస్ మోడల్ కూడా లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.

ఆగస్టు 18నే లాంచ్ :
ప్రస్తుతానికి చైనా మార్కెట్లో ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 2K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుందని కంపెనీ ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ధృవీకరించింది. ఎఫ్2 లూమినెసెంట్ మెటీరియల్‌తో ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ కానుంది. అదనంగా, డిస్‌ప్లే టాప్ 2000 నిట్స్ వరకు బ్రైట్ నెస్ అందిస్తుంది.

రాబోయే ఈ ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ ఫోన్‌తో పాటు, కంపెనీ ఐక్యూ జెడ్11ఎస్ కూడా రిలీజ్ చేస్తోంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా.

Read Also : Vivo X300 FE Price : వివో లవర్స్‌కు బిగ్ షాక్.. వివో X300 FE ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా ఖరీదే!

ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ ఇటీవలే చైనా టెలికాం సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 256GB, 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్లలో వస్తుందని అంచనా. ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా.

ఐక్యూ జెడ్11 త్వరలోనే లాంచ్ :
ఆగష్టు 20న భారత మార్కెట్లో ఐక్యూ మరో మిడ్-బడ్జెట్ ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌ ఐక్యూ జెడ్11 పేరుతో రానుంది. ఈ ఫోన్ ధర ఇటీవలే వెల్లడైంది. ఐక్యూ జెడ్11 భారత మార్కెట్లో ధర రూ.40వేల రేంజ్ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

రాబోయే ఈ ఐక్యూ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ ఫోన్ టాప్ బ్రైట్‌నెస్ 5000 నిట్స్ వరకు ఉంటుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా, ఈ డిస్‌ప్లే ఐ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.