iQOO Neo 11 Ultra : 2K డిస్‌ప్లే, డైమన్షిటీ 9500Mతో ఫస్ట్ ఫోన్ ఇదే! ఐక్యూ నియో 11 అల్ట్రా లాంచ్ ఎప్పుడంటే?

iQOO Neo 11 Ultra : ఐక్యూ నియో 11 అల్ట్రా బ్యాక్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంటుందని అంచనా. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా ఉంటుందని అంచనా.

iQOO Neo 11 Ultra

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9500M ప్రాసెసర్‌తో వస్తుంది
  • 6.83-అంగుళాల 2K ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది
  • రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు

iQOO Neo 11 Ultra : వివో సబ్-బ్రాండ్ ఐక్యూ వచ్చే వారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ ఐక్యూ నియో 11 అల్ట్రా కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500M ప్రాసెసర్ ఉంటుంది.

ఈ చిప్‌సెట్‌ను ఐక్యూ నియో 11 సిరీస్ కోసం మీడియాటెక్‌తో కలిసి డెవలప్ చేసింది. ఐక్యూ నియో 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు, కీలక ఫీచర్లను షేర్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 2K ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను విజినోక్స్ F2 లూమినెసెంట్ మెటీరియల్‌తో రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్‌తో టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది.

ఈ అల్ట్రా ఫోన్ డిస్‌ప్లే 2,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 98 శాతం ఫస్ట్ ఫ్రేమ్ బ్రైట్‌నెస్ రేషియో కూడా ఉంటుంది. ఈ డిస్‌ప్లే డేంజరస్ బ్లూ లైట్‌ను 5 శాతం తగ్గించి కంటి రక్షణను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ 2.0 అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. మెరుగైన కంటి రక్షణ కోసం నేచురల్ లైటింగ్ అందిస్తుందని చెబుతున్నారు.

Read Also : Honor Magic 9 Series : హానర్ మ్యాజిక్ 9 సిరీస్ వస్తోందోచ్.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో దుమ్మురేపనుందా?

ఆగస్టు 18న చైనాలో లాంచ్ :
ఐక్యూ నియో 11 అల్ట్రా ఆగస్టు 18న చైనాలో లాంచ్ కానుంది. ఇటీవలే ఐక్యూ నియో 11 అల్ట్రా MT6993M మోడల్ నంబర్‌తో చైనా టెలికాం వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో పాటు 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB వేరియంట్లలో వస్తుందని అంచనా.

9,100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐక్యూ నియో 11 అల్ట్రా బ్యాక్ ప్యానెల్‌పై 3D ఫ్లోయింగ్ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మ్యాట్ ఫినిషింగ్‌తో మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉంటుందని అంచనా. సెక్యూరిటీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుందని అంచనా.