iQOO Neo 11 Ultra Launch : బ్యాటరీ బీస్ట్ వచ్చేసింది.. కొత్త ఐక్యూ నియో 11 అల్ట్రా అదుర్స్.. ఎంత వాడినా ఛార్జింగ్ దిగదు.. ధర ఎంతంటే?

iQOO Neo 11 Ultra Launch : ఐక్యూ కొత్త అల్ట్రా ఫోన్ వచ్చేసింది. ఐక్యూ నియో 11 అల్ట్రా భారీ బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ అల్ట్రా మోడల్ ధర, ఫీచర్ల వివరాలివే..

iQOO Neo 11 Ultra

  • ఐక్యూ నియో11 అల్ట్రాలో 50MP ప్రైమరీ కెమెరా
  • 9100mAh బ్యాటరీ, ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా
  • 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు

iQOO Neo 11 Ultra Launch : ఐక్యూ కొత్త అల్ట్రా ఫోన్ అదుర్స్.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ నియో 11 అల్ట్రాను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 9100mAh బ్యాటరీ ఉంది. నియో 11 అల్ట్రా బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉన్నాయి. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500M 3nm చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఐక్యూ నియో11 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఐక్యూ నియో11 అల్ట్రా ధర :
ఈ ఐక్యూ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లు (రూ. 48,250), 16GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లు (రూ. 53,925), 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లు (రూ. 56,765), 16GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లు ( రూ. 62,440)కు అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చైనాలో అమ్మకానికి ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో11 అల్ట్రాలో 6.83-అంగుళాల 2K+ విజినోక్స్ F2 LTPS అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 3200×1440 పిక్సెల్స్, 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఆర్మ్ మాలి-జీ1 అల్ట్రా MC12 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500M 3nm చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Read Also : Vivo T5 Pro 5G Price : బాబోయ్.. ఫోన్ అదే.. ఫీచర్లు అవే.. వేలల్లో పెరిగిన వివో 5G ఫోన్ ధరలు..!

12GB/16GB LPDDR5X అల్ట్రా ర్యామ్, 256GB/512GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6.0పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 9100mAh బ్యాటరీతో వస్తుంది. 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరా పరంగా చూస్తే.. ఐక్యూ నియో11 అల్ట్రాలో ఎఫ్/1.88 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.45 అపర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందిస్తుంది.

కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 163.42 మిమీ పొడవు, 75.88 మిమీ వెడల్పు, 8.6 మిమీ మందం, 230 గ్రాముల బరువు ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, సింగిల్ USB టైప్-సి పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి.