Iran War SIM Swap Scam (Image Source: AI generated/ Google Gemini)
Iran War SIM Swap Scam : ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ వాతావరణం నెలకొంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సిమ్ స్కామ్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిమ్ స్వాప్ స్కామ్ గురించి దుబాయ్ పోలీసులు అక్కడి ప్రజలను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు. అధికారుల ప్రకారం.. స్కామర్లు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేలా ప్రేరేపిస్తారు. తాము అధికారులమంటూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. గుర్తుతెలియని కాలర్లతో వ్యక్తిగత, బ్యాంకింగ్ లేదా ఇతర వివరాలను షేర్ చేయొద్దని, అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే రిపోర్టు చేయాలని దుబాయ్ పోలీసులు సూచనలు చేస్తున్నారు.
“ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. దుబాయ్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ మాదిరిగా మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. స్కామర్‌ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. UAE పాస్ డిజిటల్ గుర్తింపు డేటా, ఎమిరేట్స్ ID (EID)ని హ్యాక్ చేస్తారు.
ఈ డేటాను షేర్ చేస్తే స్కామర్‌లు SIM స్వాప్ ఈజీ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లు స్కామర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ” అని దుబాయ్ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
దుబాయ్ పోలీసుల కథనం ప్రకారం.. :
సైబర్ మోసగాళ్ళు నివాసితులను వారి యూఏఈ పాస్ డిజిటల్ ఐడెంటిటీ, ఎమిరేట్స్ ID (EID) సమాచారాన్ని షేర్ చేయమని అడుగుతారు. ఈ డేటాను షేర్ చేస్తే సిమ్ స్వాప్ ద్వారా ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌ను హ్యాక్ చేసి మీ బ్యాంకింగ్ యాప్‌లు, అకౌంట్లలో యాక్సెస్ పొంది ఖాళీ చేస్తారు.
హ్యాకర్లు, స్కామర్లు బాధితుడి మొబైల్ నంబర్ హ్యాక్ చేసి కొత్త సిమ్ కార్డుకు స్వాప్ చేస్తారు. ఈ ఆన్‌లైన్ మోసగాళ్ళు ఆ నంబర్‌ను తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTP) పొంది మీ బ్యాంక్ అకౌంట్లు లేదా ఇతర సేఫ్ యాప్ డేటాను మాయం చేస్తారు.
UAE పాస్ డేటా, ఎమిరేట్స్ ID సమాచారం లేదా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌లు వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ అడగరు. ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్ వస్తే వెంటనే రిపోర్టు చేయాలని కోరారు. ఇలాంటి మోసాలపై 901కు కాల్ చేయాలని లేదంటే అధికారిక eCrime ప్లాట్‌ఫారమ్ ద్వారా సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయాలని కోరారు.
“మీ డేటాను షేర్ చేయడం వల్ల స్కామర్లు SIM స్వాప్ చేసి బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఫోన్ లేదా మెసేజ్ ద్వారా ప్రైవసీ డేటా లేదా వెరిఫికేషన్ కోడ్‌లను ఎప్పుడూ అడగరు.
అనుమానాస్పద వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయొద్దు. సైబర్ క్రైమ్ ఫిర్యాదు కోసం 901కి కాల్ చేయండి. లేదంటే ఈక్రైమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మోసాన్ని వెంటనే రిపోర్టు చేయండి” అని దుబాయ్ పోలీసులు సూచిస్తున్నారు.