SBI YONO : ఎస్బీఐ YONO కస్టమర్లకు బిగ్ వార్నింగ్.. మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? ఈ పొరపాటు అసలు చేయొద్దు..!

SBI YONO : ఎస్బీఐ యోనో యాప్, ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే యాప్ బ్లాక్ అవుతుందని మెసేజ్‌లో ఉంది.. ఇందులో నిజమేనా?

SBI YONO account

  • ఎస్బీఐ యోనో యాప్‌లో ఫేక్ ఆధార్ అప్‌డేట్ మెసేజ్
  • పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఆ వాదనను పూర్తిగా ఫేక్ అని తేల్చింది
  • APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దు, పర్సనల్ డేటాను షేర్ చేయొద్దు

SBI YONO : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీరు యోనో ఎస్బీఐ వినియోగదారులు అయితే ఇది మీకోసమే.. ఆధార్ అప్‌డేట్ స్కామ్ పట్ల జాగ్రత్త.. మీకు ఇలాంటి మెసేజ్ వస్తే అసలు స్పందించొద్దు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సమాచారం ప్రకారం.. ఎస్బీఐ పేరుతో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్‌తో పాటు వచ్చే APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటేనే వినియోగదారులు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోగలరని ఆ మెసేజ్‌లో ఉంది.

మెసేజ్ అంతా ఫేక్.. నమ్మొద్దు :
ఒకవేళ, ఆధార్ అప్‌డేట్ చేయకపోతే.. ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందని కూడా అందులో ఉంది. ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ నివేదించింది. ఈ విషయమై ఎస్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని స్పష్టం చేసింది.

Read Also : Mahindra Thar EMI : మిడిల్ క్లాసు మహీంద్రా థార్.. రూ. లక్ష డౌన్‌పేమెంట్‌ కట్టి ఇంటికి తెచ్చుకోండి.. నెలకు EMI ఎంతంటే?

అదనంగా, బ్యాంకు కస్టమర్లు ఇలాంటి APK ఫైల్‌ను అసలు డౌన్‌లోడ్ చేయవద్దు. ఈ ఫైల్‌లలో బ్యాంకింగ్ లేదా ఆధార్ వివరాల వంటి ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు. అంతేకాదు.. మీకు ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే “report.phishing@sbi.co.in”కు రిపోర్టు చేయాలని సూచించింది.

యోనో కస్టమర్లు జర జాగ్రత్త :
ముఖ్యంగా వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్యాంకింగ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ అటాక్స్ పెరుగుతున్నాయని స్పష్టం చేస్తోంది. సైబర్ మోసగాళ్లు ఎక్కువగా ఖాతాదారులను మరింత భయాందోళనకు గురిచేసి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని తెలిపింది. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కూడా కాజేస్తున్నారని ఇలాంటి మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి.

డిజిటల్ బ్యాంకింగ్ ట్రెండ్ నేపథ్యంలో యోనో వంటి యాప్‌ల వాడకం భారీగా పెరిగింది. చాలామంది యోనో యాప్ ఎక్కువగా వాడేస్తున్నారు. ఇదే సమయంలో అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారిక సోర్సెస్ నుంచి వచ్చే వెరిఫైడ్ అప్‌డేట్‌లను మాత్రమే యాక్సస్ చేయాలని ప్రభుత్వ సంస్థ వినియోగదారులకు సూచించింది.