itel A100 Pro Variant : వావ్.. ఆఫర్ అదిరింది బ్రో.. కొత్త ఐటెల్ A100 ప్రో కొంటే ఫ్రీగా నెక్ బ్యాండ్.. ఈ డీల్ మిస్ కావొద్దు!
itel A100 Pro Variant : ఐటెల్ కంపెనీ అద్భుతమైన ఆఫర్.. 4GB ర్యామ్ వేరియంట్ కొనుగోలు చేసిన వినియోగదారులకు కంపెనీ నెక్ బ్యాండ్‌ను ఫ్రీగా ఆఫర్ అందిస్తోంది. ఇదేలా పొందాలంటే?
- Sreehari A
- Published on- June 19, 2026 / 04:55 PM IST
itel A100 Pro Variant
- ఐటెల్ A100 ప్రోలో 6.6-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే
- 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్, 8MP ఏఐ కెమెరా సెటప్
- ఐటెల్ ఫోన్ కొన్న 100 రోజులలోపు మాత్రమే ఆఫర్
itel A100 Pro Variant : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి కంపెనీ ఐటెల్ నుంచి సరికొత్త వేరియంట్ వచ్చేసింది. ఐటెల్ A100 ప్రో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. గత నెలలో 8,999 ధరతో 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ రాగా ఇప్పుడు, 64GB స్టోరేజ్‌తో 4GB ర్యామ్ వేరియంట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే, కంపెనీ మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ బ్రాండ్ ఫోన్‌తో పాటు ఫ్రీగా నెక్ బ్యాండ్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ (itel A100 Pro Variant) ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో ఐటెల్ A100 ప్రో 4GB వేరియంట్ ధర :
కంపెనీ ఐటెల్ A100 ప్రో కొత్త 4GB ర్యామ్ వేరియంట్ అందిస్తుంది. 64GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 10,999కు లభిస్తుంది. కామెట్ ఆరెంజ్, క్లౌడ్ వైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ఐటెల్ ఫోన్ కొన్న 100 రోజులలోపు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రూ. 1499 విలువైన ఫ్రీ నెక్ బ్యాండ్ :
కంపెనీ ఈ ఫోన్‌తో పాటు అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. 4GB ర్యామ్ వేరియంట్ కొంటే కంపెనీ రూ. 1,499 విలువైన నెక్ బ్యాండ్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. మీకు బాక్స్‌లోనే నెక్ బ్యాండ్ ఫ్రీగా లభిస్తుంది. ప్రత్యేకించి కొనాల్సిన పని ఉండదు అనమాట.
Read Also : Oppo Reno 16c : ఒప్పోనా మజాకా.. కొత్త రెనో 16C మాస్ ఎంట్రీకి రెడీ.. కెమెరా ఫీచర్లు అరాచకం భయ్యా..!
ఐటెల్ A100 ప్రో స్పెసిఫికేషన్స్:
ఐటెల్ A100 ప్రో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IPS ప్యానెల్‌తో వస్తుంది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది DTS-ట్యూన్డ్ ఆడియోకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయిన యూనిసోక్ T7100 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త వేరియంట్ 4GB RAM 64GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8GB వర్చువల్ RAMకు కూడా మద్దతు ఇస్తుంది.
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 8MP ఏఐ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో వస్తుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.
సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందిస్తుంది. ఇతర ఫీచర్లలో ఫేస్ అన్‌లాక్, ఐఆర్ బ్లాస్టర్, అల్ట్రా లింక్ కనెక్టివిటీ ఉన్నాయి. మన్నిక కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
