Jio-Airtel Recharge : జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు.. ఫుల్ డిటెయిల్స్
Jio Airtel Recharge : మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. జియో ఎయిర్‌టెల్ ఈ ఏడాది రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 15శాతం నుంచి 20శాతం మేర పెంచే అవకాశం కనిపిస్తోంది..
- Sreehari A
- Updated on- July 3, 2026 / 05:32 PM IST
Jio, Airtel Users Alert
- మొబైల్ వినియోగం మరింత ఖరీదైనదిగా మారనుంది
- ఎయిర్‌టెల్, జియో కంపెనీలు త్వరలోనే మొబైల్ రీఛార్జ్‌లు పెంచొచ్చు
- రీఛార్జ్ ప్లాన్‌లలో 15శాతం నుంచి 20శాతం వరకు పెంచే అవకాశం
Jio-Airtel Recharge: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. రాబోయే కొద్దిరోజుల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెరగనున్నాయి. అతిపెద్ద టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ మొబైల్ టారిఫ్‌లను 15 నుంచి 20 శాతం వరకు పెంచనున్నాయని ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి పోస్ట్ చేశారు.
అయితే, ఈ కంపెనీలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పెరుగుతున్న ఖర్చులు, 5G నెట్‌వర్క్‌లలో పెట్టుబడులు, ప్రతి షేరుపై వచ్చే ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలనే లక్ష్యంతో కంపెనీలు త్వరలోనే టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు.
గత ఏడాదిలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. ఒకవేళ టారిఫ్‌లు మళ్లీ పెరిగితే లక్షలాది మొబైల్ యూజర్ల జేబులపై నేరుగా ప్రభావం పడుతుంది.
15-20 శాతం వరకు పెంపు?
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను సుమారు 15 నుంచి 20శాతం మేర పెంచవచ్చని టిప్‌స్టర్ సంజు చౌదరి ట్వీట్ చేశారు. ఆ కంపెనీలు టారిఫ్‌లను పెంచాలని యోచిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఎయిర్‌టెల్ రూ. 799 ప్లాన్‌ను సైలెంట్ గా తొలగించింది. దాంతో బడ్జెట్ యూజర్లకు ఉన్న మరో ఆప్షన్‌ను కూడా తగ్గించిందని ఆయన ట్వీట్ చేశారు.
రీఛార్జ్ ప్లాన్ల ధర పెంపునకు కారణం ఇదే :
టెలికాం కంపెనీలు గత కొన్నేళ్లుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. తమ 5జీ నెట్‌వర్క్‌ల రేంజ్ విస్తరిస్తున్నాయి. అంతేకాదు.. స్పెక్ట్రమ్ కొనుగోలు, నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త టెక్నాలజీలను అమలుకు భారీ మొత్తంలో ఖర్చులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్‌లను పెంచవచ్చు. జియో, ఎయిర్‌టెల్ చాలా కాలంగా ARPUను పెంచుకునే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.
యూజర్లపై ధరల ప్రభావం :
ప్రీపెయిడ్ యూజర్లపై భారీ ప్రభావం పడనుంది. ప్రస్తుతం రూ. 299 ప్లాన్ ధర సుమారు రూ. 345 నుంచి రూ.360కి పెరగవచ్చు. తద్వరా నెలవారీ మొబైల్ ఖర్చు పెరుగుతుంది. కంపెనీలు అన్ని రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచుతాయా లేదా కేవలం ఎంపిక చేసిన ప్లాన్‌లు మాత్రమే పెంచుతాయా? అనేది క్లారిటీ లేదు. కంపెనీలు సాధారణంగా అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, లాంగ్ వ్యాలిడిటీని అందించే పాపులర్ ప్లాన్ల ధరలే పెంచుతాయి.
