Jio Independence Day : పండగ చేస్కోండి.. జియో ఫ్రీడమ్ ధమాకా! 100Mbps బ్రాడ్‌బ్యాండ్‌పై రూ.6 వేలు భారీ తగ్గింపు!
Jio Independence Day : రిలయన్స్ జియో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధరను రూ. 6వేలు తగ్గింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 15 నెలల ఈ ప్లాన్ ఇప్పుడు నెలకు సుమారు రూ. 666కే లభిస్తుంది. ఇందులో OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
- Sreehari A
- Published on- August 3, 2026 / 06:42 PM IST
Jio Independence Day
- జియో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ. 6వేలు తగ్గింపు
- యూజర్ల కోసం స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్
- 15 నెలల ప్లాన్ ఇప్పుడు నెలకు జస్ట్ రూ. 666కే
- OTT బెనిఫిట్స్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు
Jio Independence Day : జియో కస్టమర్లకు పండగే.. జియో లాంగ్ టైమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కోసం స్పెషల్ ఇండిపెండెన్స్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫెస్టివల్ ప్రమోషన్‌లో భాగంగా కంపెనీ 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై రూ. 6వేలు తగ్గింపు అందిస్తోంది.
ఈ ప్లాన్ నెలవారీ ధర సుమారు రూ. 666కి తగ్గింది. ఈ లిమిటెడ్ టైమ్ డీల్ మైజియో యాప్‌లో మాత్రమే (Jio Independence Day) అందుబాటులో ఉంది. కానీ, జియో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం లేదు. జియో కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కొంతమంది యూజర్లకు మాత్రమే వర్తించనుంది. పూర్తి జియో ఆఫర్, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ఆఫర్లు, ధరపై ఓసారి లుక్కేయండి..
100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర తగ్గింపు :
జియో ఫ్రీడమ్ డే ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద 15 నెలల జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ. 16వేలు ఉండగా రూ. 10వేలకే అందిస్తోంది. తద్వారా కస్టమర్లు రూ. 6వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. నెలవారీ ఖర్చు సుమారు రూ. 1,066తో పోలిస్తే.. ఈ తగ్గింపు ధర నెలకు దాదాపు రూ. 666 మాత్రమే చెల్లించాలి. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా, 100Mbps ఇంటర్నెట్ స్పీడ్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 12కు పైగా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
ఈ ప్యాకేజీలో మైజియో యాప్‌లో JioHotstar, SonyLiv Zee5 సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఉన్నాయి. గత ఏడాదిలో జియో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫెస్టివల్ బ్రాడ్‌బ్యాండ్ డిస్కౌంట్లను ఆఫర్ చేయగా ఈ ఏడాది కూడా అదే ఆఫర్లను అందిస్తోంది.
జియో హోమ్ ప్లాన్లు ఇవే :
జియో బ్రాడ్‌బ్యాండ్, టీవీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను సింగిల్ ప్లాన్ కింద అందిస్తోంది. జియో సరికొత్త హోమ్ ప్యాక్ రేంజ్ తర్వాత ఈ ఇండెపెండెన్స్ ఆఫర్ తీసుకువచ్చింది. కొత్త పోర్ట్‌ఫోలియో నెలకు రూ. 400 నుంచి చెల్లించాలి.
ఇందులో టీవీ ఆప్షన్ మాత్రమే. 1,000కుపైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 12కుపైగా ఓటీటీ యాప్‌లు, టీవీలో యూట్యూబ్ ప్లే/పాజ్ లైవ్ టీవీ సపోర్ట్ ఉంటాయి. కేవలం ఇంటర్నెట్ మాత్రమే వాడే వారికి జియో నెలకు రూ. 450 ధరకు 30Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్, నెలకు రూ. 600 ధరతో 100Mbps ప్లాన్ అందిస్తోంది.
అలాగే, బండిల్ కస్టమర్లు Wi-Fi + TV + OTT ప్లాన్లు ఎంచుకోవచ్చు. 30Mbps బండిల్ ధర నెలకు రూ. 555 అయితే, 100Mbps వెర్షన్ ధర నెలకు రూ. 707కు పొందవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు పొందవచ్చు. డజనుకు పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్లు పొందవచ్చు. అర్హులైన కొత్త కస్టమర్లకు ఫ్రీగా డోర్‌స్టెప్ ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ సపోర్ట్ కూడా పొందవచ్చు.
