Jio OTT Plan : జియో బంపర్ ఆఫర్! సింగిల్ రీఛార్జ్‌తో 15 OTT యాప్స్ ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ యూజర్లకు పండగే!

Jio OTT Plan : జియో అదిరిపోయే ప్లాన్.. కొత్త రీఛార్జ్ ప్లాన్ ద్వారా 15 వరకు ఓటీటీ యాప్స్ యాక్సస్ పొందవచ్చు. ఇందులో డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రీమియం ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Jio OTT Plan

  • ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌తో 15 ఓటీటీ యాప్స్ ఉచితం
  • బేస్ ప్లాన్ ఉంటే చాలు.. రూ. 200తో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్
  • 5GB హై-స్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

Jio OTT Plan : జియో యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్.. ఒకసారి మొబైల్ రీఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 15 ఓటీటీ యాప్స్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. కేవలం కాల్స్, ఇంటర్నెట్‌కు మాత్రమే కాదు.. డేటాతో పాటు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజీని పొందవచ్చు.

రూ. 200 ధరకు జియో డేటా యాడ్-ఆన్ ప్లాన్ అందిస్తోంది. ఈ సరసమైన ప్లాన్ యూజర్లకు అదనపు ఇంటర్నెట్ యాక్సెస్‌తో పాటు అనేక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా యాక్సెస్‌ అందిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఇష్టపడే యూజర్లకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అని చెప్పొచ్చు..

తక్కువ ధరకే డేటా, OTT బెనిఫిట్స్ :
ఈ జియో ప్లాన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌.. 5GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ప్రస్తుత ప్లాన్‌కు మించి అదనపు ఇంటర్నెట్ అవసరమైన వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు, OTT బెనిఫిట్స్ కూడా యాక్టివ్‌గా ఉంటాయి.

Read Also : MacBook Neo : పండగ చేస్కోండి.. ఈ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్ చాలా చీప్ గురూ.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!

అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ప్రీమియం :
ఈ ప్లాన్‌లో కేవలం డేటా మాత్రమే కాదు.. ప్రీమియం బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ ద్వారా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అనేక స్పెషల్ షోలను చూడొచ్చు. యాడ్ ఫ్రీ వీడియో వ్యూ ఎక్స్‌పీరియన్స్, యూట్యూబ్ ప్రీమియం ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

15కు పైగా OTT యాప్‌ ఫుల్ ప్యాకేజీ :
ఈ జియో ప్లాన్ కేవలం కొన్ని యాప్‌లకే పరిమితం కాదు. 15కు పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. వినియోగదారులకు మైజియో యాప్ ద్వారా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూపన్ కూడా లభిస్తుంది. అందుకే క్రికెట్ మ్యాచ్‌లు, లేటెస్ట్ మూవీలు, ట్రెండింగ్ వెబ్ సిరీస్‌లను ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.

ఇది డేటా యాడ్-ఆన్ ప్యాక్.. మీ ఫోన్ నంబర్‌పై ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. మీ ప్రైమరీ రీఛార్జ్ గడువు ముగిస్తే ఈ యాడ్-ఆన్ కూడా ఆగిపోతుంది. రీఛార్జ్ చేశాక మైజియో యాప్ ద్వారా అన్ని OTT బెనిఫిట్స్ పొందవచ్చు.