×
Ad

BSNL Cheapest Plan : BSNL యూజర్లకు లాస్ట్ ఛాన్స్.. రూ. 1కే రీఛార్జ్ ప్లాన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..

BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అందుబాటులోకి వచ్చిన రూ. 1 రీఛార్జ్ ప్లాన్ ముగుస్తోంది. జనవరి 31 వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

BSNL Cheapest Plan

  • బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్‌ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే
  • కాల్స్, డేటా, SMS బెనిఫిట్స్, ప్రైమరీ, సెకండరీ సిమ్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్
  • ఆన్‌లైన్‌లో ఈ ఆఫర్ అందుబాటులో లేదు
  • ఈ ఆఫర్‌ కోసం BSNL స్టోర్‌కు వెళ్లాలి

BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ప్లాన్.. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన రూ.1 ప్లాన్‌ మళ్లీ తీసుకొచ్చింది. వినియోగదారుల డిమాండ్ మేరకు అతి చౌకైన ధరకే రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. దేశవ్యాప్తంగా కస్టమర్ల డిమాండ్ తర్వాత తక్కువ-ధర ప్లాన్‌ తిరిగి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అయితే, ఈ రీఛార్జ్ ప్లాన్ ఫస్ట్ టైమ్ తీసుకునేవారికి కేవలం రూ.1 ధరకే లభిస్తోంది. మీరు సెకండరీ సిమ్ కోసం చూస్తుంటే ఈ బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవడం బెటర్. ఈ ఆఫర్ ఇంకా ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ మిస్ కాకముందే ఇప్పుడే ఈ ప్లాన్ తీసుకోండి.

బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ ఇదే :
బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ అన్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంది. జనవరి 31, 2026తో ఈ రూ.1 ప్లాన్ ముగుస్తోంది. ఈ ప్లాన్‌ ఎంచుకోవాలని ప్లాన్ చేసే యూజర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్. గడువు ముగిశాక ఈ ప్లాన్ పూర్తిగా నిలిచిపోతుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌కు సంబంధించి ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. ఈ ఆఫర్ పర్మినెంట్ ఎండ్ అయ్యేలోగా సబ్‌స్క్రైబ్ అవ్వడం బెటర్.

Read Also : Vivo T4 Ultra : వివో క్రేజే వేరబ్బా.. భారీగా తగ్గిన వివో T4 అల్ట్రా ఫోన్ .. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

బీఎస్ఎన్ఎల్ రూ.1 బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
ఈ రూ.1 ప్లాన్‌తో యూజర్లు దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్, రోజుకు 2GB డేటాను పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటే.. ప్రస్తుత ప్లాన్ యాక్టివేట్ తేదీ నుంచి నెల రోజుల వరకు ప్లాన్ వర్తిస్తుంది. బీఎస్ఎల్ సిమ్ నెట్‌వర్క్‌పై కావాలంటే ఈ ఆఫర్ గడువు ముగిసేలోపు తీసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ.1 ఆఫర్ ఎలా పొందాలి
రూ.1 ప్లాన్ కోసం కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత బీఎస్ఎన్ఎల్ రిటైలర్‌ వద్దకు వెళ్లాలి. ఈ ప్లాన్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. కేవైసీ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సిమ్ కార్డు పొందవచ్చు. రూ.1 ప్లాన్‌లో యాక్టివేట్ అవుతుంది. యాక్టివేషన్ తర్వాత కస్టమర్లు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను పొందవచ్చు.