Lava Yuva Star 3
Lava Yuva Star 3 Launch : కొత్త లావా ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో లావా కొత్త యువ స్టార్ 3తో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంది. రోజువారీ పర్ఫార్మెన్స్ పరంగా లావా ఫోన్ చాలా బెటర్ అంటోంది కంపెనీ.
చౌకైన ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే రూ. 8వేల లోపు ఎంట్రీ లెవల్ ఫోన్ కొనేసుకోవచ్చు. అందులోనూ ఈ లావా ఫోన్ 4G కనెక్టివిటీ, డ్యూయల్ కెమెరా, IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ అందిస్తుంది. భారత మార్కెట్లో లావా యువ స్టార్ 3 పూర్తి స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
లావా యువ స్టార్ 3 స్పెసిఫికేషన్లు :
లావా యువ స్టార్ 3 మోడల్ 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. యూనిసోక్ SC9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 4జీబీ ర్యామ్ అందిస్తుంది. వర్చువల్‌గా అదనంగా 4జీబీ ద్వారా విస్తరించవచ్చు. ఈ లావా ఫోన్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
Read Also : Samsung Galaxy S25 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
ఈ లావా ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌లో రన్ అవుతుంది. క్లీన్, బ్లోట్‌వేర్-ఫ్రీ ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. అదనపు ఫీచర్లలో IP64-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, బ్యాండ్ 28 సపోర్ట్, ఆటో, అన్ నౌన్ కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 13MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
భారత్‌లో లావా యువ స్టార్ 3 ధర ఎంతంటే? :
లావా యువ స్టార్ 3 ఫోన్ 4GB + 64GB వేరియంట్ ధర రూ. 7,499కు లభ్యం కానుంది. ఈ ఫోన్ ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్చి 2026 నుంచి దేశంలోని రిటైల్ అవుట్‌లెట్‌లలో సేల్స్ ప్రారంభం కానున్నాయి. లావా ఫోన్ ఫ్రీ హోమ్ సర్వీస్‌తో పాటు ఒక ఏడాది వారంటీని కూడా అందిస్తోంది.