Samsung Galaxy S25 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 : శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ ధర రూ. 13,600 తగ్గింది. కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 లాంచ్ కు ముందే ఈ ఆఫర్ అమెజాన్ అందిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S25
- ఫిబ్రవరి 25న శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెజాన్‌లో రూ.12,100 తగ్గింపుతో రూ.67,900కి లిస్టింగ్
- నెలకు ఈఎంఐ రూ. 2,387, బ్యాంక్ కార్డులతో హిడెన్ ఛార్జీలు
Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 25న శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. రూ.80,999కు లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం దాదాపు రూ.66,500కు లభిస్తోంది.
ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, అమోల్డ్ ప్యానెల్, కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో అందిస్తుంది. ఇలాంటి ఫోన్ మళ్లీ దొరకదు. శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర ఎంతంటే? :
అమెజాన్‌లో రూ.12,100 తగ్గింపుతో రూ.67,900కు లిస్ట్ అయింది. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుతో అదనంగా రూ.1,500 సేవ్ చేసుకోవచ్చు. దాంతో ధర దాదాపు రూ.66,500కు తగ్గుతుంది. అయితే, ఇప్పుడు ఎక్స్ఛేంజ్ ద్వారా 35,950 వరకు బెస్ట్ వాల్యూను పొందవచ్చు. ఈ ఫోన్ వర్కింగ్ కండిషన్, బిల్లింగ్ తేదీ, మోడల్, వేరియంట్ ఆధారంగా ఫోన్ వాల్యూ ఉంటుంది.
అంతేకాదు, ఈ శాంసంగ్ ఫోన్ ఈఎంఐతో కొనేసుకోవచ్చు. నెలకు ఈఎంఐ రూ. 2,387 చెల్లించాలి. బ్యాంక్ కార్డులతో హిడెన్ ఛార్జీలు ఉంటాయి. అదనంగా, ఎక్స్టెండెడ్ వారంటీ యాడ్-ఆన్ అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 6.2-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్‌తో వస్తుంది, 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీని అందిస్తుంది.
25W వైర్డు, 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,000mAh బ్యాటరీని అందిస్తుంది. OISతో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ సహా ట్రిపుల్-కెమెరా సిస్టమ్ అందిస్తుంది. 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
