iPhone Lost : మీ ఐఫోన్ పోగొట్టుకున్నారా? డోంట్ వర్రీ.. ఫైండ్ మైతో ఇలా కనిపెట్టేయొచ్చు.. రిమోట్‌గా లాక్ చేయొచ్చు!

Lost Your iPhone : మీరు పోగొట్టుకున్న ఐఫోన్‌ను కనిపెట్టడంతో పాటు డేటాను డిలీట్ చేయడం లేదా డివైజ్ లాక్ చేసేందుకు ఈ ఫైండ్ మైని ఈజీగా ఉపయోగించవచ్చు. అది ఎలాగంటే?

Lost Your iPhone

  • ఫైండ్ మై ఉపయోగించి పోగొట్టుకున్న ఐఫోన్‌ కనిపెట్టొచ్చు
  • ఫైండ్ మైతో ఐఫోన్ డేటాను కూడా డిలీట్ చేయొచ్చు
  • ఈ యాప్ ద్వారా ఐఫోన్‌ రిమోట్‌గా లాక్ చేయొచ్చు

Lost Your iPhone : మీ ఆపిల్ ఐఫోన్ పొగొట్టుకున్నారా? పోయిన ఐఫోన్‌ను కనిపెట్టడం తెలుసా? మీ ఐఫోన్ డేటాను డిలీట్ చేసేందుకు ఫైండ్ మై ఫీచర్ ఉపయోగించవచ్చు. ఈ ఫైండ్ మై బ్రౌజర్‌లో ఐక్లౌడ్ ద్వారా లేదా మరొక ఆపిల్ డివైజ్ లోని ఫైండ్ మై యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఇతర ఐఫోన్‌లో మీ iCloud అకౌంట్ లాగిన్ అయ్యేందుకు మీ ఆపిల్ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరి. మీరు ఫైండ్ మైని (iPhone Lost) వాడి మీ పోగొట్టుకున్న ఐఫోన్‌ను ఎలా కనిపెట్టాలి? రిమోట్‌గా ఎలా లాక్ చేయాలి? ఐఫోన్ పూర్తి డేటాను ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫైండ్ మై ఉపయోగించి మీ ఐఫోన్‌ను ఎలా కనిపెట్టాలి? :

  • ముందుగా, బ్రౌజర్‌లో iCloud.com/find లింక్ ఓపెన్ చేయండి. లేదా మరో ఆపిల్ డివైజ్‌లో ఫైండ్ మై యాప్‌ను ఉపయోగించండి.
  • మీ ఐఫోన్‌కు లింక్ చేసిన ఆపిల్ ఐడీతో సైన్ ఇన్ చేయండి.
  • డివైజ్’ (Devices) సెక్షన్‌కు వెళ్లి మీ ఐఫోన్‌ను ఎంచుకోండి.
  • అందుబాటులో ఉంటే మ్యాప్స్ లొకేషన్ ఎంచుకోండి.
  • మీ ఐఫోన్ దగ్గరలో ఉంటే లొకేషన్ గుర్తించేందుకు ‘ప్లే సౌండ్’ (Play Sound) ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ ఐఫోన్ దూరంగా ఉంటే మీరు ఆ లొకేషన్ డైరెక్షన్ కూడా పొందవచ్చు.

పోగొట్టుకున్న ఐఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయడం ఎలా? :

Read Also :  Flipkart Sasa Lele Sale : ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరే డీల్స్.. తక్కువ ధరలో ఏది కొంటారో కొనేసుకోండి..!

  • మరొక ఐఫోన్ ‘Find My’ని ఓపెన్ చేసి మీ ఐఫోన్‌ను ఎంచుకోండి.
  • ఐఫోన్ డివైజ్ సేఫ్టీ కోసం ‘Lost Mode’ను ఆన్ చేయండి.
  • ప్రొటెక్షన్ కోసం ఒక పాస్‌కోడ్‌ను సెట్ చేయండి లేదా కన్ఫార్మ్ చేయండి.
  • లాక్ స్క్రీన్ కోసం ఫోన్ నంబర్, మెసేజ్ యాడ్ చేయండి.
  • ఒకసారి ఆన్ చేసిన తర్వాత డివైజ్ లాక్ అవుతుంది.

ఫైండ్ మై (Find My) ఉపయోగించి మీ ఐఫోన్‌ డేటాను ఎలా డిలీట్ చేయాలి? :

  • మైండ్ మై ఓపెన్ చేసి మీ ఆపిల్ ఐడీతో సైన్ ఇన్ చేయండి.
  • డివైజ్ లిస్ట్ నుంచి మీ ఐఫోన్‌ను ఎంచుకోండి.
  • ఐఫోన్ డేటాను డిలీట్ చేసే ఆప్షన్ ఎంచుకోండి.
  • రీసెట్ ప్రాసెస్ కోసం కన్ఫార్మ్ చేయండి.
  • ఐఫోన్ నుంచి మొత్తం డేటా డిలీట్ అవుతుంది.
  • ఐఫోన్ మళ్లీ ఓపెన్ చేయాలంటే మీ ఆపిల్ ఐడీ అవసరం.