Maruti 800: మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

రెడ్ ఆక్సైడ్ తో పెయింట్ చేయించి త్వరగా తుప్పు పట్టకుండా రెడీ చేశారు. చివరకు లైమ్ ఎల్లో కలర్ వేసి.. సన్ లైట్ కు మెరిసిపోయేలా..

Maruti 800: మారుతీ సుజుకీ ఇండియా అత్యధిక మార్కెట్ షేర్ సంపాదించుకోవడానికి కారణం ఆ తయారీపై ఉన్న నమ్మకమే. ఇండియాలో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు మెయిన్ ఫోకస్ గా మారిపోయిన బ్రాండ్లలో ఫస్ట్ ఛాయీస్ మారుతీ 800. మోడల్ పాతదే అయినా కొన్ని దశాబ్దాలుగా మోటార్ ఫీల్డ్ లో రాజ్యమేలుతుంది.

ఇక్కడ మనం మారుతీ 800.. రీ మోడల్ చేసి లాంబోర్గినిగా ఎలా మారిపోయిందో చూద్దాం. ఈ వీడియోను మాగ్నెటో 11అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశారు. దీని షేప్ చూస్తే చెప్పేదాకా మారుతీ 800అంటే ఎవ్వరూ నమ్మరు.

ఎందుకంటే దీని రూఫ్ మొత్తం తొలగించి ఎక్స్ టీరియర్ అంతా లాంబోర్గినీలా సెట్ చేశారు. వెనుకవైు అవే స్టిక్కర్లు కూడా అంటించారు. రేర్ సెక్షన్ మిడిల్ సెక్షన్లో రెండు ఎక్స్ హాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు.

Maruthi 800

ఇంజిన్ ఒక్కటి పాతది ఉంచి అంతా మారిపోయింది. మెటల్ షీల్డ్ ను వెల్డింగ్ పెట్టించి బానెట్ ను మాడిఫై చేయడంతో మరింత స్పోర్టీగా మారిపోయింది. ఇక మాడిఫైడ్ బంపర్ స్థానంలో స్టాక్ బంపర్ వచ్చి కూర్చొంది. మెకానిక్ లు ఇంజిన్ పై పనిచేయడానికి ఏదైనా పార్ట్ మార్చాలి లేదా సర్వీస్ చేయాలి అనుకుంటే ఈజీగా చేసేయొచ్చు.

Maruthi 800 (1)

హెడ్ లైట్లును ప్రొజెక్టర్ సెటప్ తో.. ఎల్ఈడీ డేలైట్ రన్నింగ్ లైట్ తో అరేంజ్ చేశారు. వీల్స్ కూడా అంతముందున్న దాని కంటే వెడల్పు ఉన్న వాటిని ఫిక్స్ చేశారు. ఇక తర్వాత రెడ్ ఆక్సైడ్ తో పెయింట్ చేయించి త్వరగా తుప్పు పట్టకుండా రెడీ చేశారు. చివరకు లైమ్ ఎల్లో కలర్ వేసి.. సన్ లైట్ కు మెరిసిపోయేలా ప్లాన్ చేశారు.

Maruthi 800 (2)

వెనుక సీటును తీసేసి.. టూ సీటర్ వెహికల్ చేశారు. డోర్ పాడ్ లను క్లాత్ తో కవర్ చేశారు. ఇదంతా మాడిఫై చేయడానికి రూ1.25 లక్షలు అయిందని నెల రోజుల్లో పూర్తయిందని చెప్తున్నారు. చివరిగా తెలుసుకోవాల్సిందేంటంటే ఇండియాలో ఇలా వెహికల్ మాడిఫికేషన్ చేయడం చట్టబద్ధం కాదు. అలా చేసిన వాహనం రోడ్ పై తిరిగితే దానిని పోలీసులు సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు