Mera Ration App : రేషన్ కార్డు మిస్సయిందా? ఆధార్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ ఇలా..

Mera Ration App : రేషన్ కార్డు పోయిందా? ఇక ఆందోళన అవసరం లేదు. మేరా రేషన్ 2.0 యాప్ ద్వారా మొబైల్‌లోనే రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఇతర సేవలు ఎలా పొందాలో తెలుసుకుందాం..

Ration Card Download

రేషన్ కార్డు పోయిందా? మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.
రేషన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
రేషన్ కార్డుదారులు ఇంట్లో కూర్చొనే ఈ పనులన్నీ చేయొచ్చు

Mera Ration App : రేషన్ కార్డు పోయిందా? ఎక్కడ పెట్టారో గుర్తు రావడం లేదా? కొత్త కాపీ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలుసా? మీ చేతిలో స్మార్ట్‌ఫోన్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే చాలు..

ఇంట్లో కూర్చొనే రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మేరా రేషన్ 2.0 యాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. మరి ఈ యాప్ ఎలా వాడాలి? రేషన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొబైల్‌లో రేషన్ కార్డు డౌన్‌లోడ్.. :
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. అందులో (Mera Ration 2.0) అని సెర్చ్ చేసి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషియరీ యూజర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీ 12 అంకెల ఆధార్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

Read Also : Telangana Pension Hike : తెలంగాణ పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. రూ.2 వేల పింఛన్‌ రూ.4 వేలకు పెంపు.. మంత్రి కీలక ప్రకటన!

తర్వాత లాగిన్ విత్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. లాగిన్ పూర్తయిన తర్వాత ఎంపిన్ (MPIN) సెట్ చేసుకోవచ్చు. ఇకపై యాప్‌లోకి ఈజీగా లాగిన్ అయ్యేందుకు దీన్ని వాడొచ్చు..

యాప్ హోమ్‌పేజీలోకి వెళ్లిన తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అడిగిన వివరాలు, రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి మీ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యాప్‌లో మరిన్ని సేవలు :
మేరా రేషన్ 2.0 యాప్ కేవలం రేషన్ కార్డు డౌన్‌లోడ్‌కే కాదు. కుటుంబ సభ్యుల వివరాలను చెక్ చేసుకోవచ్చు.. కొత్త సభ్యుల పేర్లు చేర్చడం, అర్హతలకు అనుగుణంగా పేర్లు డిలీట్ చేయడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

అంతేకాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రేషన్ కార్డు ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం ఉంది. కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నవారు ట్రాక్ మై రేషన్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రేషన్ ఎంటైటిల్‌మెంట్ విభాగంలో మీకు ఎంత రేషన్ వస్తుంది? ఇప్పటికే ఎంత తీసుకున్నారు? అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు..