Mivi One 5G Deal : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్.. రూ.26వేల ఫోన్ జస్ట్ రూ.14,249కే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!
Mivi One 5G Deal : స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 5జీ ఫీచర్లతో ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌తో రూ.14,249కే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- November 8, 2026 / 05:37 PM IST
Mivi One 5G Deal
- 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ సెటప్, మివి 5జీ ఫోన్‌పై బంపర్ ఆఫర్
- తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కొనాలా? మివి వన్ 5జీపై అదిరిపోయే డీల్
- 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. రూ.11 వేలకు పైగా తగ్గింపు
Mivi One 5G Deal : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మరీ ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి తీసుకొచ్చిన వన్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 50MP కెమెరా, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
మివి వన్ 5జీ ధర ఎంతంటే? :
మివి వన్ 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.25,999కు లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా 37 శాతం తగ్గింపు పొందవచ్చు.. తద్వారా ధర రూ.16,499కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.2,250 తగ్గింపు పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ వర్తిస్తే.. మివి ఫోన్‌ను కేవలం రూ.14,249కే ఇంటికి తెచ్చుకోవచ్చు.. అయితే, బ్యాంక్ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
మివి వన్ 5జీ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్క్రోలింగ్, సాధారణ వినియోగం మరింత స్మూత్‌గా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు..
కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ఫీచర్ 6000mAh భారీ బ్యాటరీ. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
అదనంగా ఐపీ64 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. మొత్తంగా తక్కువ ధరలో 5జీ ఫోన్ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.
