Moto G57 Power
Moto G57 Power : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో మోటో G57 పవర్ లాంచ్ కానుంది. ఈ మేరకు టెక్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ ఇటీవల నవంబర్ 5న ఎంపిక చేసిన ఈయూ దేశాలలో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ కీలక స్పెసిఫికేషన్‌లను కూడా కంపెనీ టీజ్ చేసింది.
గ్లోబల్ వేరియంట్‌కు (Moto G57 Power) సమానంగా కనిపిస్తాయి. భారత మార్కెట్లో మోటో G57 పవర్ ఫోన్ 7,000mAh బ్యాటరీతో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 SoC ద్వారా పవర్ పొందుతుంది. 50MP సోనీ LYT-600 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది.
మోటో G57 పవర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
నవంబర్ 24న భారత మార్కెట్లో మోటో G57 పవర్ లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ భారతీయ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT-600 సెన్సార్ ఉంది.
రాబోయే స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. నవంబర్ 5న ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో మోటోరోలా EUR 279 (సుమారు రూ. 28వేలు) ప్రారంభ ధరకు మోటోరోలా మోటో G57 పవర్‌ను ఆవిష్కరించింది.
ఈ ఫోన్ ఈయూలో పాంటోన్ కోర్సెయిర్, పాంటోన్ ఫ్లూయిడిటీ, పాంటోన్ పింక్ లెమనేడ్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. మోటో G57 పవర్ భారత మార్కెట్లో కనీసం 3 కలర్ ఆప్షన్లలో అమ్మకానికి వస్తుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన స్పెసిఫికేషన్లు గ్లోబల్ ఫోన్‌కు సమానంగా ఉంటాయి.
మోటో G57 పవర్ 120Hz రిఫ్రెష్ రేట్, 391ppi పిక్సెల్ డెన్సిటీ, 1,050 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.72-అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 SoC ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. మోటో G57 పవర్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ సోనీ LYT-600 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 3-ఇన్-1 లైట్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. మోటో G57 పవర్ ఫోన్ డస్ట్, స్ప్లాష్ నిరోధకతతో IP64 రేటింగ్‌తో పాటు డ్రాప్ ప్రొటెక్షన్ కోసం MIL-STD-810H6 సర్టిఫికేషన్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది.