Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఐఫోన్ 17 ప్రో కన్నా తోపు ఫీచర్లతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!
Best Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Camera Phones
Best Camera Phones : మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ కన్నా అదిరిపోయే ఫీచర్లు కలిగిన అనేక ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే.. అందరూ ఐఫోన్‌ల వైపు ఆసక్తి చూపిస్తుంటారు.
కానీ, ఈ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (Best Camera Phones) కిర్రాక్ కెమెరా ఫీచర్లతో మరింతగా ఆకట్టుకునేలా ఉన్నాయి. మీరు కూడా కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఈ 5 ఫోన్లను ఓసారి లుక్కేయండి.. ఐఫోన్ 17 ప్రో కన్నా బెటర్ కెమెరా ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కొంటారో కొనేసుకోండి.
వివో X200 ప్రో (రూ. 71,099) :
గత ఏడాదిలో వివో X200 ప్రోను లాంచ్ చేసింది. ఇందులో 50MP + 200MP + 50MP బ్యాక్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మొత్తంమీద, స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే కెమెరా ఫీచర్లు కలిగి ఉంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 99,999) :
రాబోయే ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ 50MP + 200MP సెన్సార్లతో పవర్‌ఫుల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అద్భుతమైన సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంది. పవర్‌ఫుల్ ఫొటోల కోసం కెమెరా సిస్టమ్ హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G (రూ. 1,29,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ క్వాడ్-కెమెరా సిస్టమ్ 200MP + 10MP + 50MP + 50MP సెటప్ కలిగి ఉంది. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పొచ్చు.
వన్‌ప్లస్ 15 (రూ. 72,999) :
వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ 50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కలర్ స్పెక్ట్రమ్ సెన్సార్, LED ఫ్లాష్ HDR వంటి ఫీచర్లతో అద్భుతమైన ఫొటోలను యాక్సస్ చేయొచ్చు. ఈ వన్‌ప్లస్ 15 ఫోన్ భారీ 7300mAh బ్యాటరీతో వస్తుంది.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
48MP+50MP డ్యూయల్-కెమెరా సెటప్, 42MP సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫొటోలు, సెల్ఫీలను క్యాప్చర్ చేస్తుంది. మల్టీ-జోన్ లేజర్ AF, LED ఫ్లాష్, పిక్సెల్ షిఫ్ట్, అల్ట్రా-HDR, బెస్ట్ టేక్ జూమ్ ఎన్‌హాన్స్ ఫీచర్లు ఫొటోలు మరింత క్లారిటీగా వస్తాయి. ఈ ఫోన్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది.
