Moto G87 Launch : 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో కొత్త మోటో G87 ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Moto G87 Launch : కొత్త మోటోరోలా జీ87 ఫోన్ లాంచ్ అయింది. 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో జీ87 ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Updated on- April 30, 2026 / 02:33 PM IST
Moto G87 Launch : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ప్రపంచ మార్కెట్లోకి మోటోరోలా నుంచి కొత్త మోటో G87 వచ్చేసింది. ఈ ఫోన్‌లో 30W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీ ఉంది.
మోటో జీ87 ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఎఫ్/2.2 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. మోటో G87 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
మోటో జీ87 ధర ఎంతంటే? : ధర విషయానికి వస్తే.. మోటో G87 ప్రారంభ ధర 399 యూరోలు (సుమారుగా రూ. 44,230). ఈ ఫోన్ రాబోయే వారాల్లో EMEA (యూరప్, మధ్యప్రాచ్యం ఆఫ్రికా) LATAM (లాటిన్ అమెరికా)లో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది.
మోటో G87 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : మోటో జీ87 ఫోన్ 1272 x 2772 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. ఏఆర్ఎమ్ మాలి-జీ57 MC2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
4GB/8GB LPDDR4x ర్యామ్, 128GB/256GB యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. 30W టర్బోఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. మోటో G87 బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ఎఫ్/2.2 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
164.58 మిమీ పొడవు, 77.37 మిమీ వెడల్పు, 7.38 మిమీ మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో USB టైప్-సీ పోర్ట్, 5జీ, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-సీ, NFC ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66/IP68/IP69 రేటింగ్‌లతో MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తుంది.
