Motorola Edge 30 Pro : అద్భుతమైన ఆఫర్ బ్రో.. ఈ మోటోరోలా ప్రో ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Edge 30 Pro : మోటోరోలా ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 30 Pro

  • ఈ మోటోరోలా ఫోన్‌ 46శాతం తగ్గింపు ధరకే లభ్యం
  • మోటోరోలా ఫోన్‌పై నేరుగా రూ. 16 వేల తగ్గింపు
  • మోటో ఫోన్‌తో పాటు బ్యాంకు డిస్కౌంట్, మరెన్నో ఆఫర్లు

Motorola Edge 30 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మీకోసం మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. మోటోరోలా అందించే పాపులర్ ఫోన్లలో ఇదొకటి. ఈ ఫోన్‌ కొనేందుకు ఇదే అద్భుతమైన అవకాశం.

ఈ మోటోరోలా ఎడ్జ్ సిరీస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ (Motorola Edge 30 Pro)ను రూ. 55,999 ధరకు లాంచ్ చేయగా ఇప్పుడు రూ. 17వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, 50MP మెయిన్ కెమెరా ఉన్నాయి. మోటోరోలా ఫోన్ బెస్ట్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో డిస్కౌంట్ ఆఫర్ :
మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB వేరియంట్ లాంచ్ సమయంలో రూ. 55,999 ధరకు వచ్చింది. అయితే, కంపెనీ ఈ ఫోన్‌ను 46శాతం తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్‌పై నేరుగా రూ. 16వేలు తగ్గింపు లభిస్తోంది.

Read Also : Vivo S50T 5G : వివోనా మజాకా.. ఈ వివో 5G ఫోన్ రేంజే వేరబ్బా.. ఇలాంటి ఫోన్ లైఫ్‌లో ఒక్కసారైనా కొనాల్సిందే..!

దాంతో అసలు ధర నుంచి రూ. 30వేలకు తగ్గింది. అలాగే ఈ మోటోరోలా ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 28,500 అవుతుంది. తద్వారా మీకు మొత్తంగా రూ. 17,500 తగ్గింపు లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్స్) pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 2.5D కర్వ్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్ కూడా ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ వన్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/1.8 లెన్స్‌తో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఈ సెటప్‌లో 50MP అల్ట్రా-వైడ్ షూటర్, 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. మోటోరోలా ఈ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందించింది. ఈ ఫోన్ 24fps వద్ద 8K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 60MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,800mAh బ్యాటరీ, 68W టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ 15 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 30 ప్రోలో 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W వైర్‌లెస్ పవర్ షేరింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు 163.06×75.95×8.79mm, బరువు 196 గ్రాములు ఉంటుంది.