×
Ad

Motorola Edge 50 Pro 5G : అద్భుతమైన 50MP సెల్ఫీ కెమెరాతో ఈ మోటోరోలా 5G ఫోన్ జస్ట్ రూ. 24,999కే.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Motorola Edge 50 Pro 5G : ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర రూ. 11వేలు తగ్గింది. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, సెల్ఫీల కోసం 50MP ఆటోఫోకస్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Pro 5G (Image Credit To Original Source)

  • అమెజాన్‌లో భారీగా తగ్గిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ
  • మోటోరోలా ప్రో వెర్షన్ ధర రూ. 24,999 మాత్రమే
  • బ్యాంకు ఆఫర్లతో రూ. 1000 డిస్కౌంట్
  • రూ. 1,249 వరకు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్

Motorola Edge 50 Pro 5G : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. కంపెనీ మోటోరోలా ఎడ్జ్ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ లాంచ్ ధర కన్నా ప్రస్తుతం రూ. 11వేలు తక్కువ ధరకే లభిస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ. 35,999కు లభిస్తోంది.

అమెజాన్ ఇప్పుడు ఈ మోటోరోలా ప్రో వెర్షన్‌ను 24,999కు ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. వెయ్యి ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌కు రూ. 1,249 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆప్షన్‌తో కొనుగోలు చేయొచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్ కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G, 1.5K pOLED డిస్‌ప్లే, 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఈ మోటోరోలా ఫోన్ 256GB UFS 2.2 స్టోరేజ్ 12GB వరకు LPDDR4x ర్యామ్ అందిస్తుంది.

Motorola Edge 50 Pro 5G (Image Credit To Original Source)

స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పవర్ పొందుతుంది. ఫొటోగ్రఫీ కోసం కంపెనీ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది.

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

ఈ ఫోన్‌లో 10MP టెలిఫోటో కెమెరా, 13MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 50MP మెయిన్ లెన్స్ ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ప్రైమరీ కెమెరా ద్వారా సపోర్ట్ అందిస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 50MP ఆటోఫోకస్ కెమెరా కూడా ఉంది. అలాగే, ఈ ఫోన్ IP68 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.

125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీని అందిస్తుంది. అలాగే, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఫోన్ సపోర్టు ఇస్తుంది. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ అట్మోస్‌ కూడా ఉంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.