Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను పొందవచ్చు.

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 7:34 PM IST
  • జనవరి 16 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
  • ఐక్యూ 15 నుంచి రియల్‌మి నార్జో 90 5జీ వరకు భారీ డిస్కౌంట్లు
  • బ్యాంక్ ఆఫర్లు, ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లు, రియల్ టైమ్ ఆఫర్లు

Amazon Great Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెల 16 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఫ్యాషన్, హోం అప్లియన్సెస్, కిచెన్ వస్తువులతో పాటు సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్లు స్మార్ట్ టీవీలు వంటి వివిధ రకాల ప్రొడక్టులపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లు, రియల్ టైమ్ ఆఫర్లను అందించనుంది.

ఆసక్తిగల కస్టమర్‌లు ఈ డిస్కౌంట్లతో అనేక ప్రొడక్టులను అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా.. అమెజాన్ పలు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ సేల్‌కు ముందే ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్ వంటి కంపెనీల నుంచి ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నట్టు అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అందులో ఐక్యూ 15, వన్‌ప్లస్ 15R, రెడ్‌మి నోట్ 15 5G, రియల్‌మి నార్జో 90 5జీపై కిర్రాక్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Amazon Great Republic Day Sale

Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)

ఐక్యూ 15 :
ఐక్యూ 15 ఫోన్ ధర రూ. 68,999 లభ్యమవుతోంది. బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ ఫోన్‌ రూ. 72,999 నుంచి రూ.68,999కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.76,999 నుంచి ఈ ఫోన్‌ను రూ. 4వేల వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, శాంసంగ్ 2K M14 లీడ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

అమెజాన్‌లో వన్‌ప్లస్ 15R డీల్‌పై భారీ తగ్గింపు అందిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.54,999 ఉండగా తగ్గింపు ధరతో రూ. 47,998కు లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఈ ఫోన్ రూ. 44,999కు లభిస్తుంది. ఈ ధర వద్ద HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Read Also : Vivo X100 Pro : అద్భుతమైన డీల్ భయ్యా.. ఈ వివో X100 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

రెడ్‌మి నోట్ 15 :
అమెజాన్ సేల్ సమయంలో రెడ్‌మి నోట్ 15 5జీపై రూ. 3వేలు తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.26,999 ఉండగా ఇప్పుడు ధర రూ. 19,999కు లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్‌తో ఈ ఫోన్ అతి తక్కువ ధరకే పొందవచ్చు.

రియల్‌మి నార్జో 90 5జీ ధర :
రియల్‌మి నార్జో 90 5G ఫోన్ 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 18,999 ఉండగా రూ. 16,999కు లభిస్తోంది. ఫస్ట్ టైమ్ ఈ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా, ఈ రియల్‌మి ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.