Vivo X100 Pro : అద్భుతమైన డీల్ భయ్యా.. ఈ వివో X100 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
Vivo X100 Pro : అమెజాన్‌లో వివో X100 ప్రో అదిరిపోయే ఎక్స్ఛేంజ్ డీల్ అందిస్తోంది. ఈ క్రేజీ ఫోన్ రూ. 30వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.. ఆఫర్ వివరాలివే..
Vivo X100 Pro (Image Credit To Original Source)
Vivo X100 Pro : కొత్త వివో ఫోన్ కావాలా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. అది కూడా అమెజాన్‌లోనే.. మీరు వివో లవర్స్ అయితే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. వివో X100 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.
2024లో లాంచ్ అయిన ఈఫ్లాగ్‌షిప్ X సిరీస్ ఫోన్ ఇప్పుడు ప్రారంభ లాంచ్ ధర కన్నా రూ.30వేలు తక్కువ ధరకు లభ్యమవుతోంది. అలాగే రూ. 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ.2,999 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఆఫర్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఈ వివో ఫోన్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 16GB ర్యామ్‌తో వస్తుంది. లాంచ్ సమయంలో వివో X100 ప్రో ధర రూ.89,999కు లభిస్తుంది. ఇప్పుడు అమెజాన్ ఇండియాలో అసలు ధర రూ.59,999కు లభిస్తోంది. అలాగే, ఈ వివో ఫోన్‌పై రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

Vivo X100 Pro (Image Credit To Original Source)
ధర ఎంతంటే? :
మీరు ఈ వివో ఫోన్ కొనాలని అనుకుంటే రూ.2,999 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ డీల్‌తో ఫోన్ చాలా తక్కువ ధరకే పొందవచ్చు. తద్వరా రూ.42వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, క్వాలిటీతో పాటు కంపెనీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఫైనల్ వాల్యూ ఉంటుందని గుర్తుంచుకోండి.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
వివో X100 ప్రోలో 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 2800×1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ మానిటర్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 3000 నిట్స్ అందిస్తుంది.
ఈ వివో ఫోన్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 16GB LPDDR5x ర్యామ్ ఉంది. కంప్యూటింగ్ పవర్ కోసం ఫోన్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ అందిస్తుంది.
ఈ వివో ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్ ఫొటోల కోసం 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం కంపెనీ 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. వివో ఫోన్ 5400mAh బ్యాటరీ, 100W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది.
50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ IP68 గ్రేడ్‌తో వస్తుంది. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫన్‌టచ్ OS14, ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
