Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ బంపర్ ఆఫర్.. i20 నుంచి క్రెటా వరకు రూ. లక్ష వరకు డిస్కౌంట్లు..!

Hyundai Car Discounts : హ్యుందాయ్ పలు కారు మోడళ్లపై కిర్రాడ్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు కూడా హ్యుందాయ్ కారు కొనాలనుకుంటే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు..

Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ బంపర్ ఆఫర్.. i20 నుంచి క్రెటా వరకు రూ. లక్ష వరకు డిస్కౌంట్లు..!

Hyundai Car Discounts (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 6:28 PM IST
  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 89వేల వరకు డిస్కౌంట్
  • హ్యుందాయ్ వెర్నాపై రూ. 70వేల వరకు డిస్కౌంట్
  • హ్యుందాయ్ i20పై రూ. 95వేల వరకు డిస్కౌంట్
  • హ్యుందాయ్ కార్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్లు

Hyundai Car Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? హ్యుందాయ్ కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ప్రస్తుతం హ్యుందాయ్ అనేక పాపులర్ మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీ హ్యుందాయ్ కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, ఎంపిక చేసిన కార్పొరేట్, ఇతర ఆఫర్‌లు ఉన్నాయి. హ్యుందాయ్ కార్లలో క్రెటా, XTRE, i20, i10 నియోస్, వెర్నా అల్కాజార్ మోడళ్లపైనే డిస్కౌంట్ ఉంది. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

హ్యుందాయ్ ఎక్స్‌టర్ డిస్కౌంట్ :
ప్రస్తుతం హ్యుందాయ్ చిన్న ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌పై రూ. 98వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ వేరియంట్‌ బట్టి మారుతుంది. కొన్ని వేరియంట్‌లు రూ. 90వేలు, రూ.83వేలు, రూ.63వేల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.

Hyundai Car Discounts

Hyundai Car Discounts (Image Credit To Original Source)

హ్యుందాయ్ i20 డిస్కౌంట్ :
ప్రస్తుతం హ్యుందాయ్ i20 ధర రూ. 95వేల వరకు మొత్తం డిస్కౌంట్ అందిస్తోంది. హ్యుందాయ్ i20ఎన్ లైన్ వేరియంట్ రూ. 87వేల తగ్గింపుతో లభిస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ డిస్కౌంట్ :
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రస్తుతం రూ. 89వేల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. కొన్ని వేరియంట్లపై రూ. 80వేలు, రూ.79వేలు, రూ.67వేల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది.

Read Also : Maruti Suzuki Baleno : మార్కెట్లో ఈ మారుతి కారుకు ఫుల్ గిరాకీ.. జస్ట్ రూ. 2లక్షల డౌన్ పేమెంట్ చాలు.. నెలవారీ ఈఎంఐ ఎంతంటే?

హ్యుందాయ్ వెర్నా డిస్కౌంట్ :
ప్రస్తుతం హ్యుందాయ్ వెర్నా రూ. 70వేల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ అల్కాజార్ కూడా రూ. 65వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ వెన్యూ కూడా రూ.60వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఆరా డిస్కౌంట్ :
హ్యుందాయ్ ఆరా CNG వేరియంట్‌పై రూ. 58వేల తగ్గింపుతో లభిస్తుండగా పెట్రోల్ వేరియంట్‌పై రూ. 38వేల తగ్గింపుతో లభిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా డిస్కౌంట్ :
హ్యుందాయ్ పాపులర్ కారు హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం రూ. 40వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ పెట్రోల్ వేరియంట్‌పై వర్తిస్తుంది. డీజిల్ వేరియంట్‌పై రూ. 30వేల తగ్గింపుతో లభిస్తుంది.