Maruti Suzuki Baleno : మార్కెట్లో ఈ మారుతి కారుకు ఫుల్ గిరాకీ.. జస్ట్ రూ. 2లక్షల డౌన్ పేమెంట్ చాలు.. నెలవారీ ఈఎంఐ ఎంతంటే?
Maruti Suzuki Baleno : మారుతి సుజుకి కారు కొనాలని చూస్తున్నారా? మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న కారు బాలెనో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
Maruti Suzuki Baleno (Image Credit To Original Source)
- అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి బాలెనో
- రూ. 2 లక్షల డౌన్ పేమెంట్, నెలవారీ ఈఎంఐగా రూ. 16,918
- బ్యాంకు నుంచి రూ. 8.15 లక్షలు లోన్
- మొత్తంగా కారు లోన్ రూ. 10.15 లక్షలు చెల్లించాలి
Maruti Suzuki Baleno : మారుతి సుజుకి కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తోంది. మీరు కూడా కొత్త కారు కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే. మారుతి సుజుకి కార్లలో అత్యధికంగా అమ్ముడైన కార్లు చాలానే ఉన్నాయి.
ప్రత్యేకించి 2025 ఏడాదిలో మారుతి సుజుకి సెడాన్, డిజైర్, అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవగా, అదే ఏడాది డిసెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి బాలెనో నిలిచింది.
మీరు కూడా ఈ బాలెనో కారును కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఈ కారు ధర ఎంత? డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? నెలవారీ ఈఎంఐ ఎంత అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి సుజుకి బాలెనో సేల్స్ :
2025 డిసెంబర్‌లో భారత మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మొత్తం 22,108 యూనిట్ల బాలెనో సేల్స్ జరిగాయి. డిసెంబర్ 2024లో ఈ సంఖ్య 9,112 యూనిట్లు కాగా, గత ఏడాదిలో 9,112 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti Suzuki Baleno (Image Credit To Original Source)
మారుతి సుజుకి బాలెనో ధర :
మారుతి సుజుకి బాలెనో ధర విషయానికి వస్తే.. ఈ బాలెనో వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో లభిస్తుంది. ఈ కారు టాప్-స్పెషిఫికేషన్ వేరియంట్ ధర రూ. 9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ రూ. 10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటే టాప్-స్పెక్ బాలెనో వేరియంట్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మీరు ఢిల్లీలో మారుతి సుజుకి బాలెనో టాప్ వేరియంట్ కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం సుమారు రూ. 68వేల ఇన్సూరెన్స్ రూ.36వేలు చెల్లించాలి. ఇతర ఖర్చులతో సహా మారుతి సుజుకి బాలెనో మొత్తంగా రూ. 10.15 లక్షలు ఖర్చవుతుంది. రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత బ్యాంకు నుంచి రూ. 8.15 లక్షలు లోన్ తీసుకోవచ్చు.
మీరు 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లకు ఈ లోన్ మొత్తాన్ని పొందవచ్చు. అప్పుడు నెలకు రూ. 16,918 ఈఎంఐగా చెల్లించాలి. మొత్తం 5 ఏళ్లలో ప్రతి నెలా రూ. 16,918 ఈఎంఐ ఉంటుంది. మీరు మొత్తంగా రూ. 10.15 లక్షలు చెల్లించాలి. అంటే.. కేవలం వడ్డీనే సుమారు రూ. 2 లక్షల వరకు కడతారు అనమాట.
